బ్యాడ్‌లక్ అంటే ఇతనిదే... నగలు కొట్టేయబోయి బుక్కయ్యాడు... వైరల్ వీడియో

ఖరీదైన నెక్లెస్ కొట్టేయబోయి అడ్డంగా బుక్కయిన కుర్ర దొంగ... థాయిలాండ్‌లో విచిత్ర సంఘటన... సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 4:55 PM IST
బ్యాడ్‌లక్ అంటే ఇతనిదే... నగలు కొట్టేయబోయి బుక్కయ్యాడు... వైరల్ వీడియో
సీసీటీవీల్లో రికార్డైన దొంగ దృశ్యాలు (photo: Youtube)
  • Share this:
కొన్ని సంఘటనలు చూసినప్పుడు నవ్వు ఆపుకోలేము. అలాంటిదే ఈ వీడియో కూడా. కొత్తగా దొంగతనాలు చేయడం మొదలెట్టాడో లేక... కంగారులో కన్ఫ్యూజ్ అయ్యాడో కాని చోరీ చేయబోయి... అడ్డంగా బుక్కయ్యాడు. దొంగ ప్రవర్తనను ముందుగానే గుర్తించి, జాగ్రత్త పడిన ఆ షాపు యజమాని సమయస్ఫూర్తితో వ్యవహారించి... దొంగను పట్టుకున్నాడు. నగల దుకాణంలోకి ఎంటరైన ఓ యువకుడు... ఓ ఖరీదైన నగను చూపించమని కోరాడు. అడిగిన వెంటనే ఆ నగను తీసి చూపించాడా షాపులో సేల్స్‌మెన్. దాన్ని మెడలో వేసుకుని కొద్దిసేపు ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నట్టుగా నటించాడు.

సేల్స్‌మెన్ కొద్దిగా పక్కకు తిరగానే పరుగెత్తి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే మనోడి ప్రవర్తన కాస్త తేడాగా ఉండడంతో ముందు జాగ్రత్తగా రిమోట్ కంట్రోలర్ ద్వారా డోర్స్ లాక్ చేశాడు ఆ జ్యూవెలరీ షాప్ యజమాని. దాంతో కుర్ర దొంగ ఎంత ప్రయత్నించినా డోర్ తెరుచుకోలేదు. ఇంకేం చేసినా తప్పించుకోలేనని అర్థం చేసుకుని... వెనక్కి వచ్చి నెక్లెస్ తీసి ఇచ్చేశాడు. షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వాళ్లు వచ్చి మనోడిని అరెస్ట్ చేశారు. థాయిలాండ్‌లో నవంబర్ 30న జరిగిన ఈ విచిత్ర సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దాన్ని కాస్తా యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవాళ్లందరూ బ్యాడ్‌లక్ అంటే మనోడిదే... పాపం! అంటూ కామెంట్ చేస్తున్నారు.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు