Home /News /crime /

VIRAL VIDEO WEDDING CELEBRATIONS TURN TRAGIC IN UTTAR PRADESH SONBHADRA AFTER GROOM KILLS FRIEND IN CELEBRATORY FIRING PAH

OMG: పెళ్లిలో విషాదం.. బరాత్ నుంచి నేరుగా జైలుకు వెళ్లిన వరుడు.. వీడియో వైరల్..

బరాత్ లో కాల్పులు జరుపుతున్న వరుడు

బరాత్ లో కాల్పులు జరుపుతున్న వరుడు

Uttar pradesh: అప్పటి దాక పెళ్లి బరాత్ లో సంబరంగా జరుగుతుంది. కొత్త పెళ్లి కొడుకును.. బంధువులు, స్నేహితులు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. బ్యాండ్, డీజే చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.

పెళ్లి వేడుకను (Wedding)  ప్రతి ఒక్కరు గ్రాండ్ గా చేసుకొవాలనుకుంటారు. తమ జీవింతంలో పెళ్లిని ఎవరు మరచిపోలేని విధంగా సెలబ్రేట్ చేసుకొవాలని ప్లాన్ లు వేస్తుంటారు. దీనికోసం ఈవెంట్ ఆర్గనైజర్ లను కూడా సంప్రదిస్తుంటారు. ఎంత ఖర్చు చేయడానికైన వెనుకాడరు. ప్రీవెడ్డింగ్ నుంచి, హల్దీ, మెహందీ, సంగీత్ మొదలైన అనేక కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. కానీ కొన్ని సార్లు పెళ్లి వేడుకలో అనుకొని సంఘటనలు జరుగుతాయి. అప్పుడప్పుడు పెళ్లిలో వేడుకలో విషాదకర సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో (Viral video)  నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. అప్పటి దాక... డ్యాన్స్ లు , డీజేల హోరు, వరుడిని ఊరేగిస్తున్న బంధువులు, స్నేహితులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే, వరుడు బరాత్ లో కూర్చోబెట్టారు. సోమ్ భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వరుడు మనీష్ మధేషియా అందరిముందు ఒక తుపాకీ తీశాడు. దాన్ని అందరికి చూపిస్తు ఆకాశంలో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత .. అది పేలలేదు. ఈ క్రమంలో అతను.. గన్ ను మరోసారి కిందకు తీసుకొని ట్రిగ్గర్ నొక్కాడు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. గన్ నుంచి బుల్లెట్ దూసుకొచ్చి అతను (Groom Kills Friend In Wedding) స్నేహితుడికి పొట్ట భాగంలో తగిలింది.





వెంటనే అతను కుప్పకూలిపోయాడు. ఇక్కడ విషాదకర ఘటన ఏంటంటే.. గన్ వరుడి స్నేహితుడు ఆర్మీ జవాన్ బాబులాల్ యాదవ్ ది. అయితే, బుల్లెట్ కూడా బాబులాల్ కే వెళ్లి తగిలింది. వెంటనే బాబు లాల్ ని ఆస్పత్రికి తరలించారు. అతడని చూసిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. పెళ్లి (Marriage) వేడుకలో పాల్గొనడానికి వచ్చి.. బాబు లాల్ యాదవ్ విగత జీవిగా మారడంతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.



మరోవైపు పెళ్లి తర్వాత.. కొత్త జీవితం మొదలెట్టాల్సిన వరుడు కాస్త.. అనుకొని ఘటనతో జైలు పాలయ్యాడు. ఈ ఘటనలో రెండు కుటుంబాల్లో పెను విషాదం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం వరుడు బరాత్ లో కాల్పులు జరిపిన షాకింగ్ వీడియో నెట్టింట (Social Media)  వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Gun fire, Uttar pradesh, Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు