VIRAL VIDEO TIGER CUBS HIT WITH STONES TAKEN TO HOSPITAL AFTER RESCUE IN MADHYA PRADESH PAH
OMG: మీరు మనుషులేనా.. పులి పిల్లలపై రాళ్లతో దాడి.. వైరల్ అవుతున్న వీడియో..
గాయపడ్డ పులికూనలు
Madhya pradesh: పులి పిల్లలు తల్లి నుంచి తప్పిపోయాయి. ఇంతలో అవి కాస్త గ్రామస్థుల కంటపడ్డాయి. వారు పులి కూనలను పరిగెత్తిస్తూ.. రాళ్లతో కొడుతు దాడి చేశారు.
కొన్ని సార్లు అడవిలో ఉండే క్రూర జంతువులు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అవి ఆహరం కోసం, నీటి జాడ కోసం వస్తుంటాయి. పులులు, చిరుత పులులు, ఎలుగు బంట్లు, ఏనుగులు.. తరచుగా అడవుల సమీపంలో ఉండే గ్రామాలలో ప్రవేశించిన అనేక ఘటనలు మనం వార్తలలో చూశాం. అయితే ఒక్కొసారి ఇవి మనుషులపై దాడి చేస్తాయి. మనుషులను చంపితినేస్తాయి. మరికొన్ని సార్లు.. జంతువులు మనుషుల చేతిలో చనిపోతాయి. మనుషులు క్రూర జంతువులు నుంచి కాపాడుకోవడానికి ఫెన్సింగ్ వేస్తుంటారు. దానికి కరెంట్ తీగలను పెడుతారు. వాటిని దాటడానికి ప్రయత్నించిన జీవులు చనిపోతాయి.
ఒక్కొసారి అడవిలోని జంతువుల పిల్లలు తప్పిపోతుంటాయి. అవి మనుషుల కంట పడుతుంటాయి. కొందరు వీటిని కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తారు. అధికారులను వాటికి సపర్యలు చేసి జూపార్కులకు తరలిస్తారు. మరికొందరు మూగ జీవాల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారు. జంతువులపై రాళ్లతో, కర్రలతో దాడిచేస్తు పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
— Forests And Wildlife Protection Society-FAWPS (@FawpsIndia) May 18, 2022
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) ఈ ఘటన జరిగింది. సియోని జిల్లాలోని అడవీ ప్రాంతంలో రెండు పులి పిల్లలు (Tiger cubs) దారితప్పి అడవికి సమీపంలోని గ్రామం దగ్గరకు వచ్చాయి. కొంత మంది ఆకతాయిలు పులిపిల్లలను గమనించారు. వెంటనే అరుస్తూ రాళ్లతో, కర్రలతో వాటిపై దాడిచేశారు. వారి అరుపులకు పాపం.. పులి పిల్లలు భయంతో పరుగులు పెట్టాయి. అయిన.. వదల కుండా, పులి కూనలపై దాడిచేశారు. (Brutally attack) కొంత మంది కొట్టవద్దు.. అడవి అధికారులకు సమాచారం ఇద్దాంమనడం వీడియోలో విన్పిస్తుంది. మరికొందరు అరుస్తూ... దానిపై రాళ్లు విసురుతున్నారు.
చివరకు ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకుని పులి కూనలను రెస్క్యూ చేసి, కన్హా వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అధికారులు పులి పిల్లల కాలికి, శరీరానికి గాయలైనట్లు తెలిపారు. ప్రస్తుతం వాటిని చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. మీరు మనుషులేనా చిన్న కూనలపై దాడి ఏంటని ఫైర్ అయ్యారు. దీనిపై జంతు ప్రేమికులు తీవ్రంగా పరిగణించారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను కోరారు. కాగా, దేశంలో మధ్య ప్రదేశ్ లోనే అత్యధికంగా పులులు ఉన్నాయి. ఇక్కడ.. కన్హా, బాంధవ్గర్, పెంచ్, సత్పురా, పన్నాతో సహా అనేక పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.