Home /News /crime /

VIRAL VIDEO OF MAN WITH WIFE SEVERED HEAD SHAKES IRANIANS PVN

Viral Video : వివాహేతర సంబంధం..భర్య తల నరికి,చేత్తో పట్టుకొని వీధుల్లో తిరుగుతూ

భార్య తలతో వీధుల్లో తిరుగుతున్న భర్త

భార్య తలతో వీధుల్లో తిరుగుతున్న భర్త

Wife brutally murdered : దేశం దాటి వెళ్లి తలదాచుకున్న భార్యను బలవంతంగా స్వదేశానికి తీసుకువచ్చి తన తమ్ముడితో కలిసి తల నరికి హత్య చేశాడు. అంతే కాకుండా తలను చేతితో పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కలకలం సృష్టించాడు.

Man with wife severed head  :   తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆగ్రహించిన భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. దేశం దాటి వెళ్లి తలదాచుకున్న భార్యను బలవంతంగా స్వదేశానికి తీసుకువచ్చి తన తమ్ముడితో కలిసి తల నరికి హత్య చేశాడు. అంతే కాకుండా తలను చేతితో పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కలకలం సృష్టించాడు. ఆమె తల నరికి వీధిలో ప్రదర్శించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ భయంకర ఘటన ఇరాన్‌లో చోటుచేసుకోగా...ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పత్రికలు, సోషల్ మీడియాలో ఈ హత్యోదంతంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆవేశంతో రగిలిపోతున్న నెటిజన్లు సామాజిక, చట్టపరమైన సంస్కరణలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇరాన్‌ లోని అహ్వాజ్‌లో మోనా హిదారీ (17) అనే యువతికి ఐదేళ్ల క్రితం అహ్వాజ్‌ అనే యువకుడితో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్లపాటు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అహ్వాజ్ గ్రహించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. భర్తకు విషయం తెలిసిపోయిందని గ్రహించిన భార్య....ఇరాన్ వదిలి టర్కీకి వెళ్లిపోయింది. మహిళ తండ్రి, భర్త టర్కీకి వెళ్లి మోనా హిదారీని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఇంటి నుంచి పారిపోయి మోనా హిదారీ తన పరువు తీసిందని అహ్వాజ్‌ మండిపడ్డాడు. చివరికి తన తమ్ముడితో కలిసి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. భార్య తలతో వీధుల్లో తిరుగుతూ రాక్షసుడిగా ప్రవర్తించాడు.


ALSO READ అమ్మాయిలా ప్రవర్తిస్తున్న అబ్బాయి.. తల్లిదండ్రులకు పెరిగిన అనుమానం.. బయటపడ్డ అసలు విషయం.. అదే కారణం

ఇరాన్ పత్రికలు, సోషల్ మీడియాలో ఈ హత్యోదంతంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ డిమాండ్ చేస్తున్నారు. హిదారీ ఘటనతో దేశంలోని మహిళలను గృహహింస నుంచి రక్షించేలా చట్టాలను మార్చాలని, అలాగే ప్రస్తుతం 13గా ఉన్న వివాహ వయసును కూడా పెంచాలన్న డిమాండ్ లు వ్యక్తమవుతున్నాయి. ఇక,నిందితుల రహస్య స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ మహిళా వ్యవహారాల ఉపాధ్యక్షురాలు ఎన్సీ ఖజాలీ.. పార్లమెంట్‌ను అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఇటువంటి నేరాలను అరికట్టేలా చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Extramarital affairs, Husband kill wife, Iran, Viral Video

తదుపరి వార్తలు