హోమ్ /వార్తలు /క్రైమ్ /

TSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం.. బాబోయ్.. ఆ మాటలు వినలేం.. వీడియో వైరల్

TSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం.. బాబోయ్.. ఆ మాటలు వినలేం.. వీడియో వైరల్

డ్రైవర్ పై దూర్భాషలాడుతున్న ఎమ్మెల్యే అనుచరుడు

డ్రైవర్ పై దూర్భాషలాడుతున్న ఎమ్మెల్యే అనుచరుడు

TSRTC Driver: హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాహనానికి సైడ్ ఇవ్వలేదని షాద్ నగర్౼బాలానగర్ మధ్యలో బస్సును రోడ్డు మీద అపి... ఆర్టీసీ డ్రైవర్ను బూతు మాటలు తిడుతూ కర్రతో బెదిరిస్తూ కొద్ది సేపు రోడ్ మీద హల్చల్ సృష్టించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఓ ఎమ్మెల్యే అనుచరులు తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) పై దైర్జన్యంగా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే (MlA) కారుకే సైడ్ ఇవ్వవా అంటూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. చేతిలో కర్ర పట్టుకొని బస్సులో నంచి దిగి బూతు మాటలు మాట్లాడుతూ  బెదిరించాడు. ఈ ఘటన బెంగళూరు హైవేపై షాద్ నగర్-బాలానగర్ మధ్య చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్యే కారును అతడి అనుసచరులు డ్రైవ్ చేస్తున్నారు. ఎదురుగా ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఎంత హర్న్ కొట్టినా సైడ్ ఇవ్వకపోవడంతో ఆవేశంతో ఆ అనుచరుడు ఊగిపోయాడు. ఫాస్ట్ గా వెళ్లి బస్సును ఓవర్ టేక్ చేసి.. బస్సు ముందు ఆ కారును నిలపాడు.

Etala Rajender: సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఈటలే కరెక్ట్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సర్వేల్లో షాకింగ్ విషయాలు..


అందులో నుంచి ఆ వ్యక్తి దిగి బస్సు దగ్గరకు వచ్చాడు. ఆ డ్రైవర్ పై తీవ్రంగా బూతు పురాణం అందుకున్నాడు. ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా అంటూ.. నోటికొచ్చినట్లు తిట్టాడు. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ ఘటనకు సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొన్ని క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై అతడు డ్రైవర్ ను దూషిస్తుండటంతో.. నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్నే ఇలా తిడుతున్నారంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Shocking Incident: బావ.. పత్తి చేనుకు వెళ్దాం అంటూ తన భర్తను తీసుకెళ్లింది.. కాని చివరకు ఇది ఊహించలేకపోయాడు..


ఇదిలా ఉండగా.. ఆ కారుపై 12 ఓవర్ స్పీడ్ చలానాలు ఉండటం విశేషం. ఇన్ని చాలానాలు ఉన్నా పోలీసులు ఆ కారు యజమానిపై చర్యలు తీసుకోకవపోడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీపీ సజ్జనార్ స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు..సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు.. మెట్రో డీలక్స్‌సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

Affair: అక్రమ సంబంధంపై తల్లిని ప్రశ్నించాడు.. సమాధానం రాలేదు.. దీంతో కోపంతో అతడు బెడ్ రూంకి వెళ్లి..


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనుంది ఆర్టీసీ యాజమాన్యం. దీనిపై ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మీడియాతో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదని స్పష్టం చేశారు. చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌కు మరోసారి ప్రతిపాదనలు పంపిస్తున్నామని ప్రకటించారు.

First published:

Tags: Drivers, Mahabubnagar, Tsrtc

ఉత్తమ కథలు