Video: పీకలదాకా తాగింది.. రోడ్డుపై పడుకుంది.. కర్మరా బాబూ...!

Video: పీకలదాకా తాగింది.. రోడ్డుపై పడుకుంది.. (image credit - facebook)

Video Video: ఆ యువతి ఎవరు... ఎందుకు పీకలదాకా తాగింది... రోడ్డుపై ఎందుకు హంగామా చేసింది. అక్కడ పడుకుంటుంటే... ప్రజలు ఏం చేశారు?

  • Share this:
    Video Video: మహాత్మాగాంధీ ఏమన్నారు... మహిళలు అర్థరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు... స్వేచ్ఛగా కాదు.. తాగి తందనాలాడుతున్నారు కొందరు మహిళలు. ఇదిగో... ఇలా రోడ్లపై దొర్లుతూ... "చివరకు ఎలాంటి రోజులొచ్చాయిరా దేవుడా" అనుకునేలా చేస్తున్నారు. ఇది జరిగింది విదేశాల్లో కాదు... మన దేశంలోనే. మెట్రోపాలిటన్ సిటీ అయిన పుణెలో. అక్కడి తిలక్ రోడ్డులో... హిరాబాగ్ చౌక్ ఉంది. అది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సరిగ్గా ఆ స్పాట్‌లోకి ఎంటరైంది ఈ తాగుబోతు యువతి. ఊగుతూ, తూలుతూ రాత్రివేళ రోడ్డు మధ్యలోకి వచ్చింది. వాహనదారులకు చుక్కలు కనిపించాయి. ఏమాత్రం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయకపోయినా... తమ వాహనం కింద ఆమె పడే ప్రమాదం ఉంది అని భావించి వాళ్లే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.

    కాసేపు రోడ్డుపై హంగామా చేసిన ఆ యువతి... ఆ తర్వాత రోడ్డు మధ్యలో పడుకుంది. దాంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఆమె ఎవరు... అంతలా ఎందుకు తాగింది... తాగాక ఇంటికిపోక... రోడ్డుపైకి ఎందుకొచ్చింది... ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచాయి. ఓ కారు డ్రైవర్ ఆమెను చూసి జాగ్రత్త పడ్డాడు కాబట్టి సరిపోయింది... లేదంటే ఆ కారు ఆమె పై నుంచి వెళ్లేదే. ఇదంతా కొంత మంది తమ మొబైళ్లలో రికార్డ్ చేసి... సోషల్ మీడియాకి ఎక్కించారు.

    ఆ వీడియో ఇక్కడ చూడండి.

    ఆమెను రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్దామని కొందరు ప్రయత్నించగా... "నో నో.... నోనోనోనో" అంటూ హడావుడి చేసింది. లాభం లేదురా నాయనా అనుకుంటూ... పోలీసులకు కాల్ చేశారు. కసంబాస్ పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్లకూ చుక్కలు చూపించింది. రోడ్డు పక్కకు తీసుకెళ్లబోతుంటే... అర్థం కాని మాటలేవో మాట్లాడింది...  పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. అరెస్టు చేసి... స్టేషన్‌కి తీసుకెళ్లారు.

    ఇది కూడా చదవండి: Video: వామ్మో.. ఇదెక్కడి విడ్డూరం.. కుక్కలా మొరిగిన సీగల్ పక్షి

    పుణెలో తాగుబోతులు ఎక్కువే. చాలా మంది మహిళలు కూడా బాగా తాగుతారు. కానీ ఇలా రోడ్లపైకి వచ్చి ఎవరూ పడుకోరు. ఈ ఘటన అందరూ ఆశ్చర్యపోయేలా... కొంతమంది మహిళలు కూడా ఇలా తయారవుతున్నారే అని అనుకునేలా చేసింది.
    Published by:Krishna Kumar N
    First published: