Home /News /crime /

VIRAL VIDEO DRUG TRAFFICKERS USE WATERMELONS TO TRANSPORT DRUGS SECRETLY WATCH VIDEO HERE NK

Video: పుచ్చకాయలో డ్రగ్స్ సరఫరా.. లేటెస్ట్ ట్రెండ్!

పుచ్చకాయలో డ్రగ్స్ (image credit - reddit)

పుచ్చకాయలో డ్రగ్స్ (image credit - reddit)

Video: ఎప్పుడూ ఒకేలా డ్రగ్స్ సప్లై చేస్తే థ్రిల్ ఉండదు. పోలీసులకు కూడా కిక్ రాదు. అదే ఇలా కొత్తకొత్తగా చేస్తే... కనిపెట్టేసి స్మగ్లర్ల ఆటకట్టించినట్లు ఫీలవుతారు.

    Video: చిన్నప్పుడు దొంగా-పోలీస్ ఆట ఆడటం అదో సరదా... పెద్దయ్యాక పోలీస్ అయితే పర్లేదు గానీ... దొంగ అయితేనే సమస్య. ఐతే... అలా దొంగలుగా మారుతున్న వారు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. పోలీసుల్ని బురిడీ కొట్టించి మత్తు పదార్థాలు (Drugs) సప్లై చేయడం ఎలా అనే అంశంపై పీహెచ్‌డీలు చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం, పోలీసులు పట్టేసుకోవ‌‌డం చూస్తూనే ఉన్నా... చాలా మంది యువత ఈ స్మగ్లింగ్ చేస్తుండటానికి ప్రధాన కారణం దీని ద్వారా వస్తున్న కోట్ల రూపాయల ఆదాయమే. ఒక్కసారి సీక్రెట్‌గా డ్రగ్స్ పంపగలిగితే... కోట్లు కాకపోయినా లక్షలు వస్తాయి. అలా డబ్బు ఇంకా ఇంకా కావాలనే ఆలోచనతో ఇలాంటివి చేస్తూ ఏదో ఒక రోజున దొరికిపోయి జైలుపాలవుతున్నారు యువత.

    అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లు ఒకసారి సప్లై చేసిన విధంగా మరోసారి సప్లై చెయ్యరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తారు. అలా చేస్తేనే పోలీసులకు దొరకం అనే ఆలోచన వారిది. అందువల్ల వారు ఈ రోజుల్లో డ్రగ్స్‌ని బ్యాగుల్లో, ప్యాంట్స్‌లో, పొట్టలో పట్టుకెళ్లట్లేదు. కూరగాయలు, పండ్లలో పట్టుకెళ్లడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.

    పుచ్చకాయలో డ్రగ్స్ సప్లై చేయడం కొత్త ఎత్తుగడ. అదైతే చాలా పెద్దగా ఉంటుంది. ఒకేసారి 2 కేజీల డ్రగ్స్ సప్లై చెయ్యవచ్చు. అందువల్ల దాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఓ ఆఫీసర్... పుచ్చకాయను కోసి... అందులో డ్రగ్స్ ఎలా దాచారో వీడియో ద్వారా చూపించారు. కాయ లోపలున్న జ్యూస్ మొత్తం తీసేసి... డ్రగ్స్ నింపారు. ఆ డ్రగ్ ఏదో కాదు గంజాయే.

    ఆ వీడియో ఇక్కడ చూడండి.

    అతి తెలివి చూపించారు కానీ ఆఫీసర్లు కనిపెట్టేశారు. ఓ ట్రక్కులో ఇలా పుచ్చకాయలు వెళ్తుంటే... ఆఫీసర్లకు వాటిని తినాలి అనిపించింది. సరదాగా ఓ పుచ్చకాయ తీసుకొని కోశారు. దాంతో ఈ ఎత్తుగడ బట్టబయలైంది. అన్ని కాయల్లోనూ అదే డ్రగ్.

    ఇది కూడా చదవండి: ఆమెకు 19 ఏళ్లు.. అతనికి 17 ఏళ్లు.. ఇద్దరి మధ్యా ప్రేమాయణం... చివరకు ఏమైందంటే!

    ఈ షాకింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 29న అప్‌లోడ్ చేసిన దీన్ని ఇప్పటివరకు 1.06 లక్షల మంది చూశారు. అందరికీ ఇది నచ్చింది. పోలీసులను మెచ్చుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Crime news, Viral, VIRAL NEWS, Viral vide, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు