బైకర్ తల మీద నుంచి దూసుకెళ్లిన ట్రక్కు... అయినా క్షేమంగా బయటికి... వీడియో వైరల్...

ఫిలిప్పిన్‌లో జరిగిన ఘోర ప్రమాదం... హెల్మెట్ కారణంగా ప్రాణాలతో బయటపడిన బైకర్... వీడియో ట్వీట్ చేసిన నాగపూర్ ట్రాఫిక్ డిసిపి రాజ్‌తిలక్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 9:01 PM IST
బైకర్ తల మీద నుంచి దూసుకెళ్లిన ట్రక్కు... అయినా క్షేమంగా బయటికి... వీడియో వైరల్...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 9:01 PM IST
హెల్ మెట్ (నరకాన్ని కలవకుండా) కాకుండా ఉండాలంటే హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ పోలీసులు తరుచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా సరే హెల్మెట్ పెట్టుకోకుండా స్టైల్‌గా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు వాహనదారులు. అందుకే బైకర్స్ క్షేమం కోసం హెల్మెట్ లేని వాహనాలను ఆపి, జరిమానాలు కూడా విధిస్తూ ఉంటారు రక్షక భటులు. అయితే ‘మా ప్రాణాలు మా ఇష్టం... హెల్మెట్ పెట్టుకోకపోతే మీకెందుకు’ అని కొందరు వాహనదారులు, పోలీసులకే ఎదురు సమాధానాలు చెబుతూ ఉంటారు. అయితే అలాంటి ‘రాదు...’ గ్యాంగ్‌కు గట్టి సమాధానం ఈ వీడియో. హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు... ఎందుకు అంతలా తలలు పట్టుకుని చెబుతున్నారో తెలియచేసే వీడియో ఇది.

ఓ వ్యక్తి బైక్ మీద వెళుతూ... ముందున్న కంటైనర్ ట్రక్‌ను దాటేయాలని వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అయితే ట్రక్కు వెనుక చక్రాలను దాటగానే అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తల... ట్రక్కు చక్రాల కిందికి వెళ్లిపోయింది. ట్రక్ టైర్లు అతని తలపైకి ఎక్కేశాయి కూడా. వెనక నుంచి చూసినవాళ్లంతా ఇక అతను చనిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే ట్రక్ వెళ్లిపోగానే మెల్లిగా లేచి నిల్చున్నాడు బైక్ డ్రైవర్. అతను హెల్మెట్ ధరించడం వల్ల అంత ప్రమాదం జరిగినా ప్రాణాలకు ఏమీ కాలేదు. లేకపోతే ట్రక్కు చక్రాల కింద పడి అతని తల నుజ్జునుజ్జు అయిపోయేదే. ఫిలిప్పిన్‌లో కైంటా నగరంలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఈ సంఘటనను మహారాష్ట్రలోని నాగపూర్ ట్రాఫిక్ డిసిపి రాజ్‌తిలక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జుట్టు ఊడిపోతుందని, హెయిర్ స్టైల్ చెగిరిపోతుందని హెల్మెట్ పెట్టుకోవడాన్ని భారంగా భావించేవాళ్లు ఈ వీడియో చూస్తే... తప్పక శిరాస్త్రాన్ని ధరించి తీరతారని డిసిపి నమ్మకం...

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...