• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • VIRAL RAPE VIDEO CASE VICTIM WAS TRAFFICKED FROM BANGLADESH ALL ACCUSED ARRESTED IN BENGALURU GH SK

Rape Video Case: గ్యాంగ్ రేప్ వీడియో కేసును ఛేదించిన పోలీసులు.. బాధితురాలు ఎవరంటే?

బాధిత యువతిని చిత్రహింసలకు గురిచేస్తున్న నిందితులు

పోలీసులు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ ద్వారా నిందితుడిని గుర్తించారు. అతడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఆరా తీశారు. 26 ఏళ్ల ఆ యువకుడి పేరు రిఫాతుల్ ఇస్లాం అని, అతడు 'రిదయ్‌ బాబు' పేరుతో టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుంటాడని గుర్తించారు

  • Share this:
ఓ గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఒక యువతిని కొందరు వేధించిన వీడియోకు సంబంధించిన కేసును అస్సాం, బెంగళూరు, బంగ్లాదేశ్‌ పోలీసులు కలిసి ఛేదించారు. వైరల్‌ అయిన వీడియోలో బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన వారిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. అంతకు ముందే ఆకతాయిలను గుర్తించాలని అస్సాం ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన మూలాలు బంగ్లాదేశ్‌లో ఉన్నాయని ఆ దేశ మీడియా తెలిపింది. బాధితురాలు, నిందితుల్లో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారని ఢాకా పోలీసులు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ దారుణమైన సంఘటన రెండు వారాల క్రితం కేరళలో జరిగిందని వారు చెప్పారు. బాధితురాలు, నిందితుడి కుటుంబాలను సైతం గుర్తించామని బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు.

వైరల్ అయిన ఈ వీడియోలో.. నలుగురు వ్యక్తులు, మరో యువతి కలిసి ఒక యువతిని దారుణంగా కొట్టి, వేధించారు. బాధితురాలిని తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత ఆమెను నలుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇటీవల అస్సాంలోని జోధ్‌పూర్‌లో ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వచ్చాయి. నాగాలాండ్‌కు చెందిన ఆ యువతి, జోధ్‌పూర్‌లో పనిచేస్తుంది. అక్కడే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి. అనంతరం ఈ వార్తపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అస్సాం ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న యువతి, వైరల్ వీడియోలోని బాధితురాలు ఒకరు కాదని పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సైతం ధ్రువీకరించారు. అనంతరం గురువారం మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఢాకా పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భారతదేశంలోని కేరళలో ఈ సంఘటన జరిగిందని వారు గుర్తించారు. బాధితురాలు బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్‌ ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన యువతి అని చెప్పారు. నిందుతుల్లో ఒక వ్యక్తి ఢాకాలోని హతీర్జ్‌జీల్ ప్రాంతానికి చెందినవారని వివరించారు.

పోలీసులు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ ద్వారా నిందితుడిని గుర్తించారు. అతడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఆరా తీశారు. 26 ఏళ్ల ఆ యువకుడి పేరు రిఫాతుల్ ఇస్లాం అని, అతడు 'రిదయ్‌ బాబు' పేరుతో టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుంటాడని గుర్తించారు. రిఫాతుల్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఇంటి నుంచి గెంటేశామని అతడి తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని నెలల క్రితమే అతడు ఇంటినుంచి వెళ్లిపోయాడని వారు పోలీసులకు తెలిపారు. బాధితురాలికి కూడా రెండేళ్ల నుంచి ఆమె తల్లిదండ్రులతో సంబంధాలు లేవని వివరించారు.

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠాలతో రిఫాతుల్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అమాయక మహిళలను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించడం, ఆ తరువాత వ్యభిచార ముఠాలకు వారిని అమ్మడం వీరి పని. నిందితులు అందరినీ బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వీరంతా గత కొన్ని నెలలుగా కేరళలో పని చేస్తున్నారని, అక్కడే బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డారని వెల్లడించారు.
First published: