Viral News: పోలీసు ఇంట్లోనే దొంగ‌త‌నం.. లేఖ పెట్టి మరీ దోచుకెళ్లిన దొంగ.. ఆ లెటర్ లో ఏముందంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

Viral News: పోలీసు ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి నగలు, వస్తువులు ఎత్తుకెళ్లాడు ఆ దొంగ. కానీ పోతూ పోతూ ఓ లెటర్ కూడా పెట్టిపోయాడు. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే..

  • Share this:
‘అయ్యా... నాకీ దొంగ‌త‌నం అత్య‌వ‌స‌రం. నేనిప్పుడు ఈ చోరీ చేయ‌క‌పోతే నా స్నేహితుడి ప్రాణాలు పోతాయి.. అందుకే త‌ప్ప‌డం లేదు. సారీ మిత్ర‌మా’ అంటూ ఓ లేఖ‌ను తాను దొంగ‌త‌నం చేసిన ఇంట్లో వ‌దిలి వెళ్ళాడో దొంగ‌. అది కూడా ఓ పోలీసు ఇంట్లో దొంగ‌త‌నం చేసి ఈ లెట‌ర్ వ‌దిలివెళ్ళ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బింద్ న‌గ‌రంలో జ‌రిగింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ప‌నిచేస్తున్న ఓ పోలీసు ఉద్యోగి కుటుంబం బింద్ న‌గ‌రంలో నివాసం ఉంటోంది. ఉద్యోగ‌రీత్యా స‌ద‌రు అధికారి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఉంటుండ‌గా, భార్యా పిల్ల‌లు బింద్ న‌గ‌రంలో నివ‌సిస్తున్నారు. జూన్ 30న భార్యా పిల్ల‌లు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే తిరిగి వ‌చ్చేసరికి ఇంటి తాళాలు ప‌గల‌గొట్టి ఉన్నాయి. ఇంట్లో సామాన్లు అన్నీ చింద‌ర‌వంద‌గా ప‌డి ఉన్నాయి.

ఇంట్లోని విలువైన వ‌స్తువుల‌ను ప‌ట్టుకుపోయిన దొంగ.. ఓ క్ష‌మాపణ ప‌త్రాన్ని వ‌దిలి వెళ్ళాడు. త‌న స్నేహితుడి ప్రాణం కాపాడ‌టానికి, అనివార్యంగా ఈ దొంగ‌త‌నం చేస్తున్నాన‌ని అందులో పేర్కొన్నాడు. త్వ‌ర‌లో డ‌బ్బు స‌మ‌కూర‌గానే దొంగ‌త‌నం చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానంటూ అందులో రాశాడు. ఈ ఘటనపై బింద్ న‌గ‌ర పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగ‌త‌నంలో అయిన‌వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.
ఇక జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలోనూ దొంగ‌లు త‌మ ప్ర‌తాపం చూపిస్తున్నారు. వ‌రుస దొంగ‌త‌నాల‌తో ప్ర‌జ‌లు హ‌డ‌లిపోతున్నారు. దీంతో రాంచీలోని ఒక ప్రాంతంలో దొంగ‌ల‌బారి నుంచి కాపాడుకోవ‌డానికి ఓ ఇంటి య‌జమాని వినూత్న ప్రయత్నం చేశాడు. ‘ఈ ఇల్లును ఆల్రెడీ దోచుకున్నారు క‌నుక మీ టైమ్ వృథా చేసుకోకండి’ అంటూ ఇంటి ముందు బోర్డు పెట్టాడు. రాంచీలోని పుండాగ్ ప్రాంత ప్ర‌జ‌లు దొంగ‌లు త‌మ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు. గ‌డిచిన నెల‌లో ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో 12 ఇళ్ళను దోచుకున్నారు.
Published by:Sridhar Reddy
First published: