Home /News /crime /

VILLAGERS SUSPECTED GIRL WAS KILLED BY HER PARENTS IN ADILABAD DISTRICT SNR ADB

Death Mystery:రక్తపు మడుగులో కూతురు శవం..చంపింది ఎవరంటే..!

(ఆత్మహత్యా..?పరువు హత్యా..?)

(ఆత్మహత్యా..?పరువు హత్యా..?)

Death Mystery:ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాదు పేరెంట్సే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి శరీరంగా గాయాలు, రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    యువతి చనిపోయింది. కొద్ది నెలల క్రితం వివాహం చేసుకున్న అమ్మాయి పుట్టింట్లో రక్తపు మడుగులో పడి ఉంది. ప్రాణాలు తీసుకుందని సొంత మనుషులు చెబుతున్నారు. కాదు చంపేశారని గ్రామస్తులు అంటున్నారు. పోలీసు(Police)లకు ఈ కేసులో ఏం జరిగిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తూనే..మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల స్టేట్‌మెంట్‌(Statement) ఆధారంగా కూపీ లాగుతున్నారు. ఇంతకీ ఈ మిస్టరీ డెత్‌(Death Mystery)కేసు ఎక్కడ జరిగిందో తెలుసా ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో వెలుగుచూసింది.

    డెత్‌ మిస్టరీ..
    చనిపోయిన యువతి పేరు రాజేశ్వరి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలం నాగలకొండ గ్రామం మృతురాలి స్వస్తలం. కొద్ది నెలల క్రితమే ఓ వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రులకు ఆ విషయం నచ్చకపోవడంతో ఆమె వాళ్లను కాదని ప్రియుడ్ని ప్రేమవివాహం చేసుకుంది. రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అదే విషయంపై పంచాయితీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. పరిస్థితులు ఈవిధంగా ఉన్న క్రమంలో రాజేశ్వరి పుట్టింట్లోనే చనిపోయింది. యువతి మెడపై కత్తితో గాయపర్చినట్లుగా గుర్తులు ఉండటం, అధికరక్తస్రావం జరగడం వల్లే రాజేశ్వరి రక్తపుమడుగులో పడి ఉంది.

    ఆత్మహత్యా..?పరువు హత్యా..?
    ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామంలో జరిగిన ఈ డెత్ కేసులో మిస్టరీని చేధించడం పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. విషయం తెలిసిన వెంటనే పోలీసు జాగిలాలను తీసుకొని నాగలకొండ గ్రామానికి వెళ్లారు. రాజేశ్వరి ఎలా మృతి చెందింది అని పోలీసులు ఆమె తల్లిదండ్రుల్ని విచారిస్తే ..తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. గ్రామస్తులు, ఇంటి చుట్టుపక్కల వాళ్లు మాత్రం రాజేశ్వరిని తల్లిదండ్రులే హత్య చేశారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కూతురు వేరే సామాజికవర్గానికి చెందిన యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో హత్య చేసి ఉంటారని పోలీసులకు తెలిపారు. ఇది కచ్చితంగా పరువు హత్యేనంటూ పోలీసులకు క్లూ అందించారు.

    పోలీస్ ఇన్వెస్టిగేషన్..
    ప్రాధమిక విచారణలో భాగంగానే ఇంట్లో మృతదేహాన్ని పరిశీలించారు పోలీసులు. చుట్టుపక్కల మొత్తం డాగ్ స్క్వాడ్‌తో సాక్ష్యాధారాల కోసం గాలించారు. అనుమానాస్పదమృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం, మృతురాలి తల్లిదండ్రులిచ్చిన స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసుకున్న పోలీసులు వాస్తవాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే రాజేశ్వరిది పరువు హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Death rumours

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు