దిశ హంతకుల అంత్యక్రియలకు కొత్త చిక్కు...

దిశ హత్యకేసులో నిందితులైన నలుగురు యువకులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే, వారి అంత్యక్రియలకు కొత్త చిక్కు ఏర్పడింది.

news18-telugu
Updated: December 6, 2019, 5:29 PM IST
దిశ హంతకుల అంత్యక్రియలకు కొత్త చిక్కు...
ప్రతీకాత్మక చిత్రం (Getty Images)
  • Share this:
దిశ హత్యకేసులో నిందితులైన నలుగురు యువకులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే, వారి అంత్యక్రియలకు కొత్త చిక్కు ఏర్పడింది. వారి మృతదేహాలకు పోస్టుమార్టం తర్వాత నేరుగా వారి వారి గ్రామాల్లోని స్మశాన వాటికలకు తీసుకుని వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికే అంత్యక్రియలు నిర్వహించేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహమ్మద్ ఆరీఫ్‌ మృతదేహాన్ని తీసుకుపోయేందుకు బంధువులు ఆసుపత్రికి వచ్చారు. జక్లేర్‌ గ్రామంలో ఆరీఫ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగతా ముగ్గురు నిందితులు జొల్లు శివ, జొల్లు నరేశ్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలకు గుడిగండ్ల గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలంలో నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించి మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మరోవైపు దిశ ఇంటి దగ్గర భద్రత పెంచారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో భద్రత పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్‌ టీమ్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆరిఫ్ మినహా మిగిలిన ముగ్గురు యువకులను ఖననం చేసేందుకు గొయ్యిలు తవ్వారు. అయితే, అది పట్టా భూమి అని, తమ పట్టా భూముల్లో అంత్యక్రియలు ఎలా చేస్తారంటూ కొందరు వ్యక్తులు అడ్డుచెప్పినట్టు తెలిసింది.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>