ఇదెక్కడి వ్యవహారం. బంధువుల ఇంటికి వెళ్లి.. తిరిగి తన ఊరికి వెళ్తున్న ఓ యువకుడిని ఓ గ్రామస్తులు కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా.. పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్లి.. అతడికి తుపాకి గురి పెట్టి బలవంతంగా పెళ్లి చేశారు. తనను వదిలిపెట్టండి మహాప్రభో అన్నా వాళ్లు ఎవరూ వినలేదు. కఠినంగా వ్యవహరించి.. అతడిపై దాడి చేసి మరీ పెళ్లి చేసేశారు. తర్వాత అతడు అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. ఈ ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంట్లో వేడుక ఉండటంతో తన బంధువులను ఆహ్వానించేందుకు పక్క గ్రామానికి వెళ్ళాడు నితీష్ కుమార్. అతడి ఇంట్లో ఛథ్ పండుగ ఉండటంతో ఈ సందర్భంగా అతడు తన ద్విచక్రవాహనంపై తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇలా అతడు తన తన అన్న, వదిన మరియు ఇతర బంధువులను ఆహ్వానించి తిరిగి వస్తుండగా అతడికి అనుకోని వింత సంఘటన ఎదురైంది. పొరుగూరు ప్రజలు అతడిని బంధించి బలవంతంగా వివాహం చేశారు. ఇది బీహార్ రాష్ట్రం నలంద జిల్లా ధనుకి గ్రామంలో జరగ్గా.. అక్కడ ఈ ఘటన సంచలనంగా మారింది. అతడి ద్విచక్రవాహనాన్ని ఆపి.. తుపాకీతో బెదిరించారు. అక్కడ నుంచి అతడికి నేరుగా పెళ్లిమండపానికి తీసుకెళ్లి ముస్తాబు చేశారు.
It happens only in #Bihar - अभी तक सुना अब देख भी लिए-
“ पकरुआ “ ?♀️?♀️?♀️ #marriage https://t.co/oef6cLoqcy
— Monisha Dubey (@MonishaDJourno) November 21, 2021
పెళ్లి కొడుకు వేషంలో అతడిని సిద్ధం చేశారు. అతడికి ఇదంతా ఏంటో.. అస్సలు అర్థం కావట్లే. ఒక పక్క తుపాకీతో బెదిరిస్తున్నారు.. మరో పక్క తన జీవితం ఇలా నాశనం అవుతందనే భయం.. రెండింటి మధ్య అతడు ఏం చేయాలో తోచక అలానే ఉండిపోయారు. తనను వదిలి పెట్టండి అంటూ ఎంత కోరినా వాళ్లు వినిపించుకోలేదు. ఒకానొక సందర్భంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేశారు. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో తాళికట్టేందుకు నిరాకరించడంతో అతడిని గన్‌తో బెదిరించి యువతి మెడలో తాళికట్టించారు.
ఎలాగోలా వారినుంచి బయటపడ్డ నితీష్ కుమార్ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ పెళ్లికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరోహా గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్, గన్నూ యాదవ్ సహా మరికొందరు కలిసి నితీష్‌ను బెదిరించి పెళ్లి మంటపానికి తీసుకెళ్లారని, అక్కడే బలవంతంగా పెళ్లి చేసినట్టు ఫిర్యాదు అందిందని పోలీసు అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Crime, Crime news