Home /News /crime /

VILLAGERS FELL SICK AFTER CONSUMING LASSI AT A WEEKLY MARKET IN KURTI VILLAGE IN ODISHA MALKANGIRI DISTRICT SSR

Lassi: ఎండలకు తట్టుకోలేక లస్సీ తాగుతున్నారా.. పాపం వీళ్లూ అలానే తాగారు.. కానీ చివరికి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ఎండకు తట్టుకోలేక కాస్త గొంతును చల్లబర్చుకునేందుకు ఆ సంతలో అమ్ముతున్న లస్సీని తాగారు. ఆ లస్సీ తాగిన వారిలో చాలామందికి ఇంటికెళ్లాక విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు లోనయ్యారు. దాదాపు 100 మందికి పైగా అనారోగ్యానికి లోను కావడంతో అంతా ఆసుపత్రికి వెళ్లారు.

ఇంకా చదవండి ...
    మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సంతలో తాగిన లస్సీ కొందరి ప్రాణాల మీదకు తెచ్చింది. లస్సీ తాగిన 100 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిలో 60 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మల్కన్‌గిరి జిల్లాలోని పడియా పరిధిలో ప్రతీ శుక్రవారం వారాంతపు సంత జరుగుతుంది. ప్రతీ వారంలానే ఈ వారం జరిగింది. ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి వారికి అవసరమైన నిత్యావసరాలు, సరుకులు కొనుక్కెళుతుంటారు. కుర్తీ అనే గ్రామం నుంచి ఈ సంతకు కొందరు గ్రామస్తులు వెళ్లారు. ఎండకు తట్టుకోలేక కాస్త గొంతును చల్లబర్చుకునేందుకు ఆ సంతలో అమ్ముతున్న లస్సీని తాగారు. ఆ లస్సీ తాగిన వారిలో చాలామందికి ఇంటికెళ్లాక విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు లోనయ్యారు. దాదాపు 100 మందికి పైగా అనారోగ్యానికి లోను కావడంతో అంతా ఆసుపత్రికి వెళ్లారు. వారికి ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో 60 మందికి సీరియస్‌గా ఉన్నట్లు మల్కన్‌గిరి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రఫుల్లా నంద తెలిపారు.

    ఆ లస్సీ శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబొరెటరీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆ లస్సీ తయారుచేసే సమయంలో ఏదైనా విష పురుగు అందులో పడి ఉండొచ్చని.. అది చూసుకోకుండా ఆ లస్సీని తయారుచేసి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ లస్సీ తాగిన వారిలో చాలామంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Market, Odisha, Summer, Villagers

    తదుపరి వార్తలు