గుంటూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండల కేంద్రంలోని నకరికల్లు శివారుగ్రామం శ్రీరాంపురం వద్ద ఆదివారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అమావాస్య కావటం వలన శ్రీరాంపురం వద్ద అడవి ప్రాంతమైన కొండ రోడ్డులో రంగు ముగ్గులు, పసుపు కుంకుమ, నల్లటి అన్నం, నల్ల కోళ్ళు రోడ్డు పక్కల కనిపించేసరికి స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
ఉదయాన్నే బహిర్భూమికి, పొలాలకు వెళ్లేవాళ్లు క్షుద్రపూజలు జరగడం చూసి గ్రామంలో తెలపడంతో గ్రామస్తులు కలకలం రేగింది. గ్రామంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పుడే కొత్తగా చూస్తున్నామని,పొలం పనులకు రాత్రివేళల్లో కూడా వెళుతుంటామని కనుక ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబందిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:October 29, 2019, 12:12 IST