అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిల్ని టీజ్ చేసినా అబ్బాయిలకే నష్టం. అమ్మాయిలు పక్కన ఉన్నప్పుడు కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకున్న కుర్రాళ్లకే నష్టమని రాజస్థాన్(Rajasthan)లో జరిగిన ఓ ఘటన ద్వారా తేలింది. కోట (Kota)సమీపంలోని ఓ గ్రామంలో ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తున్నారు. అటుగా వెళ్తున్న అమ్మాయిని(Eve teasing) కామెంట్ చేశారు. అంతే యువతి రోడ్డుపై వెళ్తున్న స్థానికులకు ఇద్దరు యువకులు తనను వేధిస్తున్నారని చెప్పడంతో గ్రామస్తులు రెచ్చిపోయారు. ఇద్దరు యువకులను రోడ్డుపై నిలబెట్టి కర్రలతో ఒళ్లంతా హూనం చేశారు. పాపం అబ్బాయిలు చెప్పులోకేని చోట కర్రలతో కొట్టారు. ఆడ, మగా తేడా లేకుండా అందరూ ఇద్దర్ని చితకబాదారు. మేం అమ్మాయిని ఏడిపించలేదు. .ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని చెబుతుంటే కూడా వినిపించుకోకుండా చావబాదారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ చేతిలో కర్రలకు గట్టిగా పని చేప్పారు. ఈ ఘటన అంతా రోడ్డుపైనే జరగడంతో అటుగా వెళ్తున్న వాళ్లు ఫోన్‌లో వీడియో (Video) తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వార్త వైరల్(Viral) అయింది. యువకుల వీపు వాచిపోయింది. గ్రామస్తులతో పాటు యువతి కూడా గుంపులో కలిసిపోయి ఇద్దరు పోకిరీ యువకుల్ని కొట్టిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.
అమ్మాయిని ఏడిపించారని..
అమ్మాయి ఈవ్ టీజింగ్ చేశాని చెప్పడంతో గ్రామస్తులంతా కుళ్లబోడిచిన ఇద్దరు యువకులు స్థాని మున్సిపల్ సిబ్బంది. అమ్మాయి చెప్పిన మాటను పట్టుకొని గ్రామస్తులు కొట్టిన యువకులు మాత్రం మేం ఏడిపించలేదన్నారు. ఫోన్‌లో తెలిసిన వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుకుంటుంటే అపార్ధం చేసుకుందని..ఆ అనుమానంతోనే తమపై గ్రామస్తులకు ఫిర్యాదు చేసిందని యువకులు చెప్పారు. గ్రామస్తులు మాత్రం ఇద్దరు యువకులు చెప్పిన మాటలు వినకుండా ఇటావా పోలీసులకు సమాచారమిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajasthan, Viral Video