Home /News /crime /

VILLAGERS BEAT UP A DALIT YOUTH WHO MOLESTED A MINOR GIRL IN HIMACHAL PRADESH VIDEO VIRAL SNR

Video Viral: మైనర్‌ బాలికని వేధించాడని ఉతికి ఆరేశారంతే.. వీడియో ఇదే

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Video Viral:హిమాచల్ ప్రదేశ్‌లో ఓ దళిత యువకుడు మైనర్‌ బాలికను వేధించాడని గ్రామానికి చెందిన కొందరు అతడ్ని కట్టేసి కొట్టారు. ఈఘటనలో యువకుడి చేయి విరిగింది. గ్రామస్తుల దాడి చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. దాడి చేసిన వ్యక్తులతో పాటు వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి ...
తప్పు చేసిన ఓ యువకుడికి గ్రామస్తులు ఎంత కఠిన శిక్ష విధించారో తెలుసా. అమానుషంగా, అత్యంత దారుణంగా కరెంట్‌ స్తంభానికి చేతులు కట్టేసి కొట్టడంతో ఆ యువకుడి చేయి విరిగింది. తప్పు చేశాను బాబోయ్ అని ఒప్పుకున్నప్పటికి వదిలిపెట్టకుండా క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఓ యువకుడ్ని చిత్రవధకు గురి చేసిన వీడియో(Video) ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లోవైరల్ (Viral)కావడంతో అది ఊరేనా వాళ్లు అసలు మనుషులేనే అంటున్నారు నెటిజన్లు(Netizens). అత్యంత పాశవికంగా ఉన్న ఈఘటన హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh)ఉనాలోని హరోలిHaroli పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. భండియారాBhandiyara గ్రామానికి చెందిన ఆకాష్‌కుమార్‌ (Akash Kumar)గత నెల 30వ తేది నాడు ఓ మైనర్‌ బాలిక(Minor Girl)ను వేధించాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో యువకుడ్ని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆ సమయంలో పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ముందే ఆకాష్‌కుమార్‌ బాలికను వేధించినట్లుగా ఒప్పుకున్నాడు. క్షమించమని గ్రామస్తుల ముందే కోరడంతో బాధితురాలి తల్లిదండ్రులు అతడిని క్షమించారు.

దళిత యువకుడ్ని కట్టేసి కొట్టారు..
ఈ విషయంపై గ్రామానికి చెందిన కొందరు యువకుడ్ని టార్గెట్ చేస్తూ కర్రలు, చేతులతో ఇష్టానుసారంగా కొట్టారు. అమ్మాయిని వేధించిన యువకుడు దళితుడు కావడంతో కులం పేరుతో అతడ్ని దూషించారు. కాళ్లతో తన్నారు. గ్రామస్తులు కొడుతుండగా మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆలస్యంగా బయటకువచ్చాయి. గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు ఆకాష్‌కుమార్‌కి చేయి విరగడంతో మెహత్‌పూర్ బన్సాల్ ఆసుపత్రికి వెళ్లి కట్టుకట్టించుకున్నాడు. అనంతరం తనపై దాడి చేసిన వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు తనను ఓ దళితుడిని అని చులకన చేసి కొట్టారని ఫిర్యాదు చేయడంతో ముగ్గురు వ్యక్తులపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ధీమాన్ తెలిపారు.
మైనర్‌ బాలికని వేధించాడని..

గ్రామస్తుల చేతుల్లో దెబ్బలు తిన్న కారణంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన యువకుడిపై కూడా మైనర్ బాలిక బంధువులు తిరిగి కేసు పెట్టారు. తమ అమ్మాయిని వేధించాడన్న ఫిర్యాదుతో ఆకాష్‌కుమార్‌పై పోక్సో కేసుతో పాటు ఐపిసి సెక్షన్ 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎఎస్పీ పర్వీన్ ధీమాన్ తెలిపారు. మైనర్‌ని వేధించిన కేసులో యువకుడు బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికి గ్రామస్తులు కొట్టారని బాధితుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే..మైనర్ బాలిక బంధువులు అతని క్షమాపణను తిరస్కరించి వేధింపుల కేసు పెట్టడంతో రెండు వర్గాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తప్పు చేస్తే నిందితుడ్ని పోలీసులకు అప్పగించాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు గ్రామస్తుల్ని హెచ్చిరించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Himachal Pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు