ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. వివాహితపై అత్యాచారం..

రాత్రిపూట ఒంటరిగా ఉన్న ఓ వివాహిత ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన బాలకృష్ణనాయక్ అనే యువకుడు చొరబడ్డాడు. చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన అతను.. ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనక నుంచి వెళ్లి నోరు మూసేశాడు.

news18-telugu
Updated: December 5, 2019, 7:25 AM IST
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. వివాహితపై అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లా నెకరికల్లు గ్రామంలో దారుణం జరిగింది. రాత్రిపూట ఒంటరిగా ఉన్న ఓ వివాహిత ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన బాలకృష్ణనాయక్ అనే యువకుడు చొరబడ్డాడు. చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన అతను.. ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనక నుంచి వెళ్లి నోరు మూసేశాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అత్యాచారం అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికొచ్చిన భర్తకు భార్య జరిగిన సంగతి చెప్పి బోరున విలపించింది.భార్యాభర్తలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివాహితను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలకృష్ణనాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్‌లో దిశా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మహిళలపై అత్యాచారాలకు తెరపడకపోవడం శోచనీయం.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>