వికారాబాద్‌లో విషాదం.. గ్రామ సర్పంచ్ ఆత్మహత్య

కారణాలేంటో తెలియదు ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లాలోని తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగ మార్గమధ్యలో మృతిచెందింది.

news18-telugu
Updated: March 26, 2020, 12:28 PM IST
వికారాబాద్‌లో విషాదం.. గ్రామ సర్పంచ్ ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వికారాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఓ గ్రామ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ అపర్ణ. అపర్ణ బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో అపర్ణ చనిపోయింది. కాగా సర్పంచ్ అపర్ణ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయాలు తెలియాల్సి ఉంది. అపర్ణ మృతి చెందడం పట్ల గ్రామస్తులు తీవ్ర సంతాపం తెలిపారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు