Home /News /crime /

VIKAS DUBEY HERE IS THE STIRY HOW POLICE ARRESTS VIKAS IN UJJAIN SK

Vikas Dubey: వికాస్ దుబే లొంగిపోయాడా? పోలీసులు అరెస్ట్ చేశారా?

వికాస్ దుబే

వికాస్ దుబే

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో... 'నేను వికాస్ దూబేని, కాన్‌పూర్ వాసిని' అని గట్టిగా అరిచాడు.

    యూపీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ పోలీసులకు చిక్కాడన్నది ఆసక్తిగా మారింది. ఐతే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వికాస్ దుబే ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.  ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్లి.. తానే వికాస్ దూబేనని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

    పోలీసుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆల‌యంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను  అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి గుర్తించి.. పోలీసులకు కాల్ చేసి చెప్పాడని తెలిపారు.  అప్ప‌టికే అనుమానం వ‌చ్చిన ఆల‌య సెక్యూరిటీ కూడా  వికాస్‌ను ప్రశ్నించగా.. త‌ప్పుడు ఐడీ కార్డు చూపించారని చెప్పారు. అనంతరం పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని వికాస్ దుబేను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    ఐతే వికాస్ దుబే కావాలనే లొంగిపోయాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తన గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. వికాస్ దుబేలో భయం మొదలయింది. తనను కూడా చంపుతారన్న ఆందోళన నెలకొంది. ఐతే యూపీ పోలీసులకు చిక్కినా.. లొంగిపోయినా.. ఆ విషయం బయటకు రాదని వికాస్ భావించినట్లు సమాచారం. అంతేకాదు తనను కూడా ఎన్‌కౌంటర్ చేస్తారని భయపడ్డాడు. అందుకే వేరొక రాష్ట్రంలో చిక్కితే..  ఆ వార్త దేశమంతా తెలుస్తుందని, తద్వారా ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేసినట్లు సమాచారం.

    కాగా, ఉజ్జయినిలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో... 'నేను వికాస్ దూబేని, కాన్‌పూర్ వాసిని' అని గట్టిగా అరిచాడు.


    బుధవారం ఫరీదాబాద్‌లో వికాస్ దుబే కనిపించాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే అప్రమత్తమై పరారయ్యాడు. ఐతే అతడి ముగ్గురు అనచరులు మాత్రం పోలీసులకు చిక్కారు. నిన్న వికాస్ దుబే అమర్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా.. ఇవాళ మరో ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశారు.

    ఎట్వా ప్రాంతంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా బహువా దుబేపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు మరణించాడు. అటు మరో అనచరుడు ప్రభాత్ మిశ్రా కూడా ఇతే తరహాలో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై పోలీసులు కాల్పుడు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime, Crime news, Up news, Vikas Dubey

    తదుపరి వార్తలు