వికాస్‌ కేసుపై దర్యాప్తునకు ప్రియాంక డిమాండ్.. బీజేపీపై ఆరోపణలు

ప్రియాంక గాంధీ సైతం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీ పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని..ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: July 9, 2020, 1:25 PM IST
వికాస్‌ కేసుపై దర్యాప్తునకు ప్రియాంక డిమాండ్.. బీజేపీపై ఆరోపణలు
వికాస్ దుబే, ప్రియాంక గాంధీ
  • Share this:
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వికాస్ దుబేను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నా, యూపీ నుంచి మధ్యప్రదేశ్‌కు అతడు ఎలా చేరుకున్నాడని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించేందుకే మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ డ్రామా ఆడారాని దిగ్విజయ్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటు ప్రియాంక గాంధీ సైతం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీ పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని..ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.


8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కిరాతక డాన్ వికాస్ దూబెను మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం యూపీ పోలీసులకు అప్పగించనున్నారు.

వికాస్ గ్యాంగ్‌లో ఇప్పటికే ముగ్గురిని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిన్న వికాస్ దుబే అమర్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా.. ఇవాళ మరో ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజే.. మరో ఇద్దరు అనుచరులను పోలీసులు కాల్చిచంపారు. ఎట్వా ప్రాంతంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా బహువా దుబేపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు మరణించాడు. అటు మరో అనచరుడు ప్రభాత్ మిశ్రా కూడా ఇతే తరహాలో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై పోలీసులు కాల్పుడు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఐతే కొందరు పోలీసులు వికాస్ దూబెకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీని బుధవారం యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దూబె విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading