• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • VIKARABAD ROAD ACCIDENT RTC BUS LORRY AND AUTO COLLISION SEVEN PEOPLE KILLED SU

Vikarabad Road Accident: వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Vikarabad Road Accident: వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు డీ కొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

  • Share this:
    వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు డీ కొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందినట్టుగా సమాచారం. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న వారు చెబుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా కూలీలుగా తెలుస్తోంది. వారిలో మహిళలు కూడా ఉన్నారు.

    మరోవైపు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న స్థానికులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సు.. లారీని తప్పించబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక, ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.



    స్థానికులతో పాటు, ఆర్టీసీ, లారీ డ్రైవర్లను, ప్రమాదంలో గాయపడిన వారి నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు