ఆ యువతి ప్రేమించిన వ్యక్తిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగిన రెండేళ్ల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె గుళికల మందు మింగి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో (Vikarabad District) చోటుచేసుకుంది. వివరాలు.. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి (Anantagiripalli) చెందిన ఊరడి మమత(21), రామయ్యగూడకు చెందిన దుద్యాల నవీన్‌లు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి.. వారిని ఒప్పించి రెండేళ్ల క్రితం పెళ్లి (Marriage) చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో తనకు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో.. కూతురుకు 3 తులాల బంగారం (Gold) తర్వాత పెడతానని మమత తండ్రి భాగయ్య హామీ ఇచ్చాడు. అయితే కొద్ది రోజులు గడిచిన కూడా భాగయ్య కూతుకు బంగారం ఇవ్వలేదు.
ఈలోపే భాగయ్య ఆరోగ్యం క్షీణించింది. ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ (Lockdown) విధించడం వారి కష్టాలను మరింతగా పెంచింది. దీంతో భాగయ్య కూతురు మమతకు ఇస్తానని చెప్పిన బంగారం ఇవ్వలేకపోయాడు. అయితే ఇటీవల మమత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో పెడతానని చెప్పిన బంగారం విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో తండ్రి భాగయ్య.. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని, మరికొంత సమయం వేచి చూడాలని కూతురును కోరాడు. అయితే మమత మాత్రం ఈ విషయంలో తీవ్ర మనస్తాపం చెందింది.
Married Woman: భర్త శారీరకంగా కలవడం లేదన్న భార్య.. సెక్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే..
తన పుట్టింట్లోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ నెల 15న విష గుళికలు మింగింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి (Vikarabad Government Hospital) తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో (Osmania General Hospital) చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మమత.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మృతిచెందింది.
వికారాబాద్ తహసీల్దార్ రవీందర్ పంచనామా నిర్వహించారు. అనంతరం మమత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Suicide, Vikarabad