Viakarabad Kidnap: వికారాబాద్ యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పోలీసులు షాక్

అసలు తమ కుమారుడు పెళ్లి చేసుకున్నాడనే విషయం తమకు తెలియదని అఖిల్ తండ్రి చెప్పాడు. దీపిక ఎవరో కూడా తెలియదని స్పష్టం చేశాడు

news18-telugu
Updated: September 28, 2020, 5:46 PM IST
Viakarabad Kidnap: వికారాబాద్ యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పోలీసులు షాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వికారాబాద్‌లో యువతి కిడ్నాప్ తెలంగాణలో సంచలనం రేపుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దీపికను కిడ్నాప్ చేశారు. ఐతే ఈ కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయం తెలిసింది. దీపికను ఆమె భర్త అఖిల్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన దీపిక, అఖిల్‌ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అనంతరం భర్త నుంచి విడిపోయిన దీపిక.. అప్పటి నుంచీ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు కూడా చేశారు. ఈ క్రమంలో దీపికను అఖిల్ కిడ్నాప్ చేశాడని భావిస్తున్న పోలీసులు.. విచారణ కోసం అఖిల్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి ఊహించని షాక్ తగిలింది. అసలు తమ కుమారుడు పెళ్లి చేసుకున్నాడనే విషయం తమకు తెలియదని అఖిల్ తండ్రి చెప్పాడు. దీపిక ఎవరో కూడా తెలియదని స్పష్టం చేశాడు.

గతంలో అఖిల్ కోర్టులో కనిపించాడని తన స్నేహితుని ద్వారా తెలిసిందని అతడి తండ్రి పోలీసులకు వివరించాడు. ఆ విషయం గురించి ఆరా తీస్తే ఎలాంటి సమాధానం చెప్పలేదని వెల్లడించాడు. అఖిల్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడని, ప్రతి శనివారం ఇంటికి వచ్చి సోమవారం మళ్లీ డ్యూటీకి వెళ్ళేవాడిని తెలిపాడు. అయితే ఈ శనివారం కుడా అలానే వచ్చాడని..ఐతే ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంతవరకు ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టు పేర్కొన్నారు. పోలీసులు వచ్చి చెప్పే వరకు.. వారిద్దరి పెళ్లి, దీపిక కిడ్నాప్ వ్యవహారాలు తెలియవని స్పష్టం చేశారు.

కాగా, ఆదివారం సాయంత్రం అక్కతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన దీపికను దుండగులు వచ్చి కారులో కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఇద్దరు కూతుళ్లు ఆదివారం షాపింగ్ కోసం బయటకు వచ్చారు. షాపింగ్ ముగించుకుని ఎమ్‌ఆర్పీ చౌరస్తా సమీపంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి కారులో వచ్చిన వ్యక్తులు చిన్న అమ్మాయి దీపికను కారులో ఎక్కించుకుని వెళ్లారు. చెల్లెల్ని కారులో తీసుకెళ్లడాన్ని అడ్డుకున్న ఆమె అక్కను దుండగులు పక్కకు తోసేశాను. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కొందరు కారును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. బాధితురాలి అక్క ఈ విషయం ఇంట్లో తెలుపడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దీపిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బ‌ందాలను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లకు ఈ ఘటనపై సమచారం అందించారు. అలాగే వాహన తనిఖీలు కూడా చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కూడా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దీపికను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 28, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading