news18-telugu
Updated: February 29, 2020, 4:34 PM IST
ప్రతీకాత్మకచిత్రం
విజయవాడలో ఓ భార్యకు భర్త, అత్త మామ వేధింపులు తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. నగరంలో శ్రీనగర్ కాలనీలో ఉంటున్న శ్రీవిద్యకు పెళ్లైన 16 రోజుల నుంచే భర్త చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. 2019 మే 15న శ్రీవిద్యకు... కిరణ్ కుమార్కు ఇచ్చి పెళ్లి చేశారు. అదనపు కట్నం తీసుకురావాలని ఇటు అత్తమామలు కూడా ఆమెను వేధించ సాగారు. గొడ్రాలివి పిల్లలు పుట్టారంటూ శ్రీవిద్యను మానసిక క్షోభకు గురి చేశారు. దీంతో అత్తింటి వారు పెడుతున్న అరాచకాలు భరించలేక... శ్రీవిద్య తన పుట్టింటివారికి ఫోన్ చేసింది.
ఆరోగ్యం సరిగా ఉండదు... పిల్లలు పుట్టారంటూ శ్రీవిద్యను వేధింపులకు గురి చేశారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దీంతో గతంలోనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కూడా శ్రీవిద్యకు వేధింపులు ఆగలేదు. తాజాగా మంగళవారం... శ్రీవిద్యపై కాళ్లతో దాడి చేసి... తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారి పోలీసుల సాయంతో కూతుర్ని తమ వద్దకు చేర్పించారని శ్రీవిద్య పేరెంట్స్ తెలిపారు. భర్త, అత్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవిద్య తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
February 29, 2020, 4:34 PM IST