VIJAYAWADA TWO YOUNG MEN KILLED IN ROAD ACCIDENT AFTER COMING FROM SRIKAKULAM VISAKHAPATNAM NEAR HANUMAN JUNCTION TEMPLE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Andhra Pradesh: పెళ్లి చూపుల కోసం వెయ్యి కిలోమీటర్లు బైక్ ప్రయాణం.. అమ్మాయి నచ్చింది..కానీ..!
ప్రతీకాత్మక చిత్రం
పెళ్లి చూపులన ముగించుకొని కుటుంబంతో సరదాగా గడిపిన యువకులు.. ఇంటికి బయలుదేరారు. ఐతే మరికాసేపట్లో చేరుకుంటారనగా.. ఘోరం జరిగిపోయింది.
రోడ్డు ప్రమాదాలు క్షణాలలతో జీవితాలను తలకిందులు చేస్తాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుంది. పెళ్లి చూపులు ముగించుకొని సరదాగా సొంతూరు నుంచి బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. చేతికి అందివచ్చిన కుమారులు దూరమవడంతో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద శ్రీరామనవమి రోజు ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో యుద్దరు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం, వాసుదేవపట్నానికి చెందిన బూరాడ సత్యనారాయణ.. విజయవాడలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. స్థానికంగా రాజుల బజారులోని అంకాలమ్మ గుడి సమీపంలో నివాసముంటున్నాడు. ఇటీవల సత్యనారాయణకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయిని చూడాల్సిందిగా కబురు పెట్టడంతో గుడణదలకు చెందిన స్నేహితులు బేతాళ యశోదకృష్ణతో కలిసి బైక్ పై శ్రీకాకుళం వెళ్లాడు. పెళ్లి చూపుల కార్యక్రమం ముగించుకొని కుటుంబ సభ్యులతో సరదా గడిపారు.
అనంతరం మంగళవారం రాత్రి 7గంటల సమయంలో విజయవాడ బయలుదేరారు. బుధవారం ఉదయానికి కృష్ణాజిల్లాలో ప్రవేశించారు. ఉదయం 6గంటల సమయంలో హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ సమీపంలో హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఇద్దరు బైక్ పై నుంచి ఎగిరి డివైరడర్ పై ఉన్న ఇనుప రెయిలింగ్ పై పడ్డారు. ఇరువురి తలలకు తీవ్రగాయాలయయ్యాయి. స్పాట్లోనే ఇద్దరూ మృతి చెందారు.
సత్యనారాయణ (ఫైల్)
ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే సత్యనారాయణ అతని సోదరి పూడివలస రాజేశ్వరితో ఫోన్లో మాట్లాడాడు. గంటలో విజయవాడ చేరుకుంటామని చెప్పాడు. బస్సు దిగి ఇంటికి వెళ్లిపోవాలని కూడా వారికి సూచించాడు. ఇంతలోనే ఘోరప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న హనమాన్ జంక్షన్ పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పెళ్లికావాల్సిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సత్యనారాయణ కుంటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా ఘోరం జరిగిందని అతడి సోదరి విలపిస్తోంది. మరోవైపు స్నేహితుడితో కలిసి సరదాగా వెళ్లిన యశోదకృష్ణ మృతి చెందడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చేతికంది వచ్చిన కొడుకు దూరమవడంతో తల్లిదండ్రులు షాక్ లో ఉన్నారు. బైక్ పై దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిన ఇద్దరు.. వేగానికి చిన్నపాటి నిర్లక్ష్యం తోడవడంతో నిండు జీవితాలు బలయ్యాయి. కాస్త లేటయినా సరే.. మితిమీరిన వేగంతా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సో బైక్ పై అంత దూరం ప్రయాణించే ముందు బీ కేర్ ఫుల్..
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.