Home /News /crime /

Andhra Pradesh: స్టూడెంట్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్న టీచర్.. ప్రేమికుల రోజే ఊహించని ట్విస్ట్

Andhra Pradesh: స్టూడెంట్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్న టీచర్.. ప్రేమికుల రోజే ఊహించని ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: టీచర్ సురేష్ తో పాటు అతడి సోదరి, మేనల్లుడు కూడా హింసలకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా ఆమెపై వాట్సాప్ (What’s App) , ఫేస్ బుక్ (Face Book)లో అసభ్యంగా ప్రచారం చేశారు.

    అతనో ఉపాధ్యాయుడు, పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ జీవితంలో ఎదగడం కోసం పాఠాలు చెప్పాల్సిన వాడు.. విద్యార్థినికి ప్రేమ పాఠాలు వల్లించాడు. అంతేకాదు అదును చూసి ఆమెను తీసుకెళ్లి పెళ్లికూడా చేసుకున్నాడు. కట్ చేస్తే ఆమెకు అసలు నిజం తెలిసింది. దీందో బాధతురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, తాడిగడపకు చెందిన యువతి కొన్నేళ్ల క్రితం స్థానిక అయ్యప్ప నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదివింది. అదే సమయంలో తోడేటి సురేష్ అనే వ్యక్తి అక్కడే టీచర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో యువతిని ట్రాప్ చేసిన సురేష్.. ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అంతేకాకుండా గత ఏడాది సెప్టెంబర్ 10న నెల్లూరు జిల్లా కావలికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అక్కడే కాపురం పెట్టాడు.

    కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. సురేష్ కు గతంలోనే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని యువతికి తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. భర్తని నిలదీసింది. దీంతో అప్పటి నుంచి ఆమెను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. సురేష్ తో పాటు అతడి సోదరి, మేనల్లుడు కూడా హింసలకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా ఆమెపై వాట్సాప్, ఫేస్ బుక్ లో అసభ్యంగా ప్రచారం చేశారు.

    దీంతో విసిగిపోయిన ఆమె వారి నుంచి తప్పించుకొని తాడిగడపలోని పుట్టింటింకి చేరుకుంది. తల్లిదండ్రుల సాయంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సురేష్ బాబుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలిసీ తెలియని వయసులో ఓ మోసగాడ్ని నమ్మి తమ కూతురు జీవితాన్ని నాశనం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Krishna District, Love affair, Love cheating, Love marriage, Minor girl, News, Teacher misbehave, Telugu news, Valentines Day 2021, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు