Vijayawada Hawala: విజయవాడలో హవాలా రాకెట్, రూ.1.47 కోట్లు, డాలర్లు స్వాధీనం

Vijayawada Hawala Rocket: కారులో ప్రత్యేకంగా సీటు వెనుక ఏర్పాటు చేసిన బాక్సులలో అమర్చి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో హవాలా నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

news18-telugu
Updated: September 8, 2020, 8:45 PM IST
Vijayawada Hawala: విజయవాడలో హవాలా రాకెట్, రూ.1.47 కోట్లు, డాలర్లు స్వాధీనం
విజయవాడ పోలీసులు పట్టుకున్న హవాలా డబ్బు
  • Share this:
విజయవాడలో హవాలా రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి వద్ద నుండి రూ.1. 47 కోట్ల విలువ గల నగదు, 34 వేల ఆమెరికన్ డాలర్లు, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కేవీ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసీపీలు టీ.కనకరాజు, వీ.ఎస్.ఎన్.వర్మ, ఇన్‌స్పెక్టర్ పీ.కృష్ణమోహన్, వారి సిబ్బందితో కలసి విజయవాడ, భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని, గొల్లపూడి, వై-జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఏపీ 37 బి డబ్ల్యూ 4532 నెంబరు గల స్విఫ్ట్ కారులో ప్రత్యేకంగా సీటు వెనుక ఏర్పాటు చేసిన బాక్సులలో అమర్చి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో హవాలా నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబులు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు గత కొంత కాలంగా నరసాపురంలో గల దేవి జ్యూయలరీ మార్ట్ ‌లో పని చేస్తున్నారు. ఆ షాపు యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ రూ. 50 లక్షలు , సుమారు రూ. 25 లక్షలు విలువైన అమెరికన్ డాలర్లు ఇచ్చాడు. అలాగే, విజయవాడకు చెందిన మరో నలుగురు వ్యక్తుల వద్ద నుండి (రూ. 50 లక్షలు వల్లూరి శివనాథ్ వద్ద, రూ.20 లక్షలు భారతీయ వద్ద, రూ.15 లక్షలు ఉత్తం వద్ద, రూ. 12 లక్షలు దివాకర్ వద్ద) రూ.97 లక్షలు హవాలా నగదు మొత్తం కలిపి రూ.1 కోటి 47 లక్షల నగదు, 34 వేలు అమెరికన్ డాలర్లను ఇచ్చాడు. వాటిని హైదరాబాద్ లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ జైన్ సోదరుడు అయిన కీర్తికి ఇచ్చిరమ్మని పంపాడు. ఈ హవాలా నగదును ఏపీ 37 బి డబ్యూ 4532 నెంబరు గల స్విఫ్ట్ కారులో సీటుకు వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులలో అమర్చారు. వాటిని తరలిస్తుండగా సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని అక్రమ మార్గంలో రవాణా చేస్తున్న నగదు సుమారు రూ.1 కోటి 47 లక్షల , 34 వేలు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు నిమిత్తం భవానీపురం పోలీసులకు నిందితులను అప్పగించారు. ఇన్‌కంట్యాక్స్ అధికారులకు, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వారికి సమాచారం ఇచ్చారు.

ఈ సందర్భంగా హవాలా నగదును తరలిస్తున్న నలుగురు నిందితులైన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబు, వల్లూరి శివనాద్, ప్రవీణ్ కుమార్ జైన్లను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 8, 2020, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading