ఏపీ మంత్రికి ఊరట... ఎన్నికల కేసు కొట్టేసిన కోర్టు...

2009 ఎన్నికల్లో కరప పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆయనపై పోటీచేసిన నురుకుర్తి వెంకటేశ్వరరావు అప్పట్లో ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 3:52 PM IST
ఏపీ మంత్రికి ఊరట... ఎన్నికల కేసు కొట్టేసిన కోర్టు...
మంత్రి కురసాల కన్నబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు కోర్టులో ఊరట లభించింది. కురసాల కన్నబాబుపై ఉన్న ఎన్నికల కేసును విజయవాడ ప్రత్యేక న్యాయ స్థానం కొట్టేసింది. 2009 ఎన్నికల్లో కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ సందర్భంగా కరప పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆయనపై పోటీచేసిన నురుకుర్తి వెంకటేశ్వరరావు అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎన్నికల అధికారులు విచారణ జరిపారు. ఈ కేసును కొట్టేస్తూ తాజాగా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2009 ఎన్నికల్లో కన్నబాబు పీఆర్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ సమయంలో కన్నబాబు వైసీపీ వైపు నిలిచారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. తాజాగా జగన్ కేబినెట్‌లో వ్యవసాయ మంత్రి అయ్యారు.
First published: December 5, 2019, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading