Vijayawada: సాప్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచార యత్నం.. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో..

ఫ్రతీకాత్మక చిత్రం(source-Youtube)

కాలేజ్‌లో పరిచయమైన వ్యక్తి ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలియడంతో బెదిరింపులకు దిగాడు.

  • Share this:
    ఓ యువకుడు తనపై అత్యాచార యత్నానికి పాల్పడినట్టుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఒకరు పోలీసులను ఆశ్రయిచారు. తనతో కలిసి దిగిన ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు.. అదే కాలేజ్‌లో ఎంబీఏ చదువుతున్న మణికంఠతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కొన్ని రోజులకు స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే వారు స్నేహితులుగా కలిసి ఫొటోలు తీసుకున్నారు. అయితే ఆమె స్నేహాన్ని ఆసరాగా తీసుకున్న మణికంఠ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సమయంలో తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది.

    ప్రస్తుతం ఆమ కుటుంబసభ్యులతో కలిసి భవానీపురంలో నివసిస్తున్నారు. ఆమె హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో‌ ఉద్యోగం చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. భవానీపురంలోని ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొద్ది రోజులు నుంచి ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీ సైట్‌లో ఆమె వివరాలు పెట్టారు. అయితే మ్యాట్రిమోని సైట్‌లో ఆమె వివరాలు, ఫొటో చూసిన మణికంఠ.. మార్చి 25న భవానీపురంలోని ఆమె ఇంటికి వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. లేకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

    అంతటితో ఆగకుండా ఏప్రిల్ 1వ తేదీన మణికంఠ మరోసారి ఆమె ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అసభ్యకరంగా మాట్లాడారు. గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. దీంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: