విజయవాడలో దారుణం.. కన్న తల్లే కూతుర్ని వేరొకరితో పడుకోమని..

కన్న తల్లే కూతురి బతుకును ఆగం చేయాలని చూసింది. అమ్మా! వద్దే అని వేడుకున్నా నీచంగా ప్రవర్తించింది. తాను వేరొకరితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా కూతుర్ని వాళ్లకు అప్పగించేందుకు ప్రయత్నించింది. ఈ అమానవీయ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: December 8, 2019, 8:04 PM IST
విజయవాడలో దారుణం.. కన్న తల్లే కూతుర్ని వేరొకరితో పడుకోమని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్న తల్లే కూతురి బతుకును ఆగం చేయాలని చూసింది. అమ్మా! వద్దే అని వేడుకున్నా నీచంగా ప్రవర్తించింది. తాను వేరొకరితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా కూతుర్ని వాళ్లకు అప్పగించేందుకు ప్రయత్నించింది. ఈ అమానవీయ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన భార్యాభర్తలకు కూతురు(15) ఉంది. మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో తండ్రి, కూతురు వేరుగా ఉంటున్నారు. తల్లి వేరే ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. బాలిక తాత అనారోగ్యానికి గురవడంతో సికింద్రాబాద్ రావాల్సి వచ్చింది. దీంతో తన కూతురిని తల్లి వద్ద వదిలేసి వెళ్లాడు ఆ తండ్రి. కన్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఆ తల్లి తనతో సంబంధం పెట్టుకున్న వాళ్లతో పడుకోమని బలవంతపెట్టింది. బాధితురాలు స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియోలు తీసి వాళ్లకు పంపి బ్లాక్‌మెయిల్ చేయించింది. తమతో పడుకోకపోతే తండ్రిని చంపుతామని బెదిరించారు.

తండ్రి ఇంటికి తిరిగి రాగానే ఆమె జరిగిన విషయాన్ని చెబుతూ విలపించింది. శనివారం నాడు ఆ బాలికను తీసుకొని ఆ తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు. తల్లితో పాటు, ఇద్దరు నిందితులపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>