విజయవాడలో దారుణం... కాపురంలో చిచ్చుపెట్టిన టిక్ టాక్

భార్య ఉండగానే టిక్‌టాక్‌లో మరో మహిళతో సత్యరాజు పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగక.. వారి పరిచయం పెళ్లి దాకా వెళ్లింది.

news18-telugu
Updated: October 27, 2019, 2:36 PM IST
విజయవాడలో దారుణం... కాపురంలో చిచ్చుపెట్టిన టిక్ టాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్‌టాక్ ... ఇప్పుడు ఎవరి మొబైల్‌లో చూసిన ఇదే యాప్. టిక్ టాక్‌ను జనం అంతలా అడిక్ట్ అయిపోయారు.  అయితే కొందరు ఈ టిక్ టాక్ ద్వారా లేనిపోని పరిచయాలు పెంచుకొని జీవితాలని నాశనం చేసుకుంటుననారు. తాజాగా ఓ వ్యక్తి టిక్ టాక్ పరిచయంతో సొంత భార్యనే కడతేర్చాలనుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని జరిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన సత్యరాజు  వీటీపీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైంది. అయితే  భార్య ఉండగానే టిక్‌టాక్‌లో మరో మహిళతో సత్యరాజు పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగక.. వారి పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. పరిచయమైన మహిళను భార్యకు తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి కూడ చేసుకున్నాడు.  పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో భార్యను హత్య చేసేందుకు సత్యరాజు ప్లాన్ చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ సత్యరాజు కుట్రను ముందే తెలుసుకున్న భార్య తప్పించుకుంది. భర్తపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు