ప్రస్తుత రోజుల్లో తాత్కాలిక సుఖాల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న బంధాలు వీటి వల్లే విచ్చిన్నమవుతున్నాయి. కొన్నిసార్లు ఇవే దారుణాలకు కారణమవుతున్నాయి. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడ్ని.. ఓ అన్న పక్కా స్కెచ్ వేసి హత్య చేశాడు. కానీ పోలీసుల దర్యాప్తులో చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడుకు చెందిన కొత్తపల్లి సాంబశివరావుకు అదే గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వరుసకు అన్నయ్య అవుతాడు. ఈనెల 20న గనిఆత్కూరు సమీపంలో భోజనాలు ఉన్నాయని సాంబశివరావుకు సుబ్రహ్మణ్యం చెప్పాడు. దీంతో అతడు వస్తానన్నాడు. ఇదే క్రమంలో సాంబశివరావు..., సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేసి భోజనాలు ఎక్కడ అని అడిగాడు. గనిఆత్కూరు శివారులోని పొలాల వద్దకు రావాలని చెప్పాడు. దీంతో ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన సాంబశివరావు.. బైక్ వేసుకొని వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న సుబ్రహ్మణ్యం.. అతడి కళ్లలో కారం కొట్టి తలపై కర్రతో కొట్టాడు.
వెంటనే తేరుకున్న సాంబశివరావు తిరగబడేందుకు యత్నించగా.. మరోసారి గట్టిగా కొట్టడంతో అక్కడే కుప్పకూలి అక్కడే మృతి చెందాడు. దీంతో సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహంపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. ఐతే ఎంతకీ మృతదేహం కాలకపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఐతే తర్వాతి రోజు పశువుల కాపరులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుబ్రహ్మణ్యం భార్యతో.. సాంబశివరావు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో పలుసార్లు భార్యతో పాటు సాంబశివరావును హెచ్చరించాడు. కానీ తన మాటను ఇద్దరూ లెక్కచేయకపోవడంతో సాంబశివరావును హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే కక్ష పెంచుకొని అంతమొందించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించగా.. సుబ్రహ్మణ్యంతో సాంబశివరావు భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో సుబ్రహ్మణ్యంను విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఐతే హత్య విషయం సాంబశివరావు భార్యకు ముందే తెలుసా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది. అలాగే హత్య సుబ్రహ్మణ్యం ఒక్కడే చేశాడా.. లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళతో ఉన్న సంబంధం.. అతడ్ని జైలు పాలు చేయడంతో పాటు పిల్లల్ని ఒంటరివాళ్లను చేసింది. సాంబశివరావు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సుబ్రహ్మణ్యంను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.