Home /News /crime /

VIJAYAWADA MAN ARRESTED FOR HARASSING MARRIED WOMAN TO FULFILL HIS SEXUAL DESIRES IN KRISHNA DISTRICT OF ANDHRA PRADESH PRN

Andhra Pradesh: తెలిసిన వాడే కదా అని ఫోన్ నంబర్ ఇచ్చిన మహిళ.. ఆ తర్వాత మొదలైంది అసలు కథ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తన పాతమిత్రుడు రియాజ్ కలిశాడు. కలిసి చాలా రోజులు కావడంతో ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అప్పుడప్పుడు రియాజ్ ఆ మహిళకు ఫోన్ చేసి మాట్లాడుతుండే వాడు.

    తెలిసిన వాడే కదా అని ఫోన్ నెంబర్ ఇచ్చింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే మాట్లుడుతోంది. ఇంకేముంది మనోడిలోని వక్రబుద్ధి బయటపడింది. ఉల్లట్లుండి రూటు మార్చిన పాతమిత్రుడు.. కొత్త మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు తెరలేపాడు. లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పోరంకికి చెందిన మహిళ స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటోంది. ఆమెకు కొంతకాలం క్రితం మెకానిక్ గా పనిచేసే వ్యక్తితో వివాహమైంది. ఐతే మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తన పాతమిత్రుడు రియాజ్ కలిశాడు. కలిసి చాలా రోజులు కావడంతో ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అప్పుడప్పుడు రియాజ్ ఆ మహిళకు ఫోన్ చేసి మాట్లాడుతుండే వాడు.

    ఈ క్రమంలో తన వక్రబుద్ధి బయటపెట్టిన రియాజ్.. ఆమెను తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసాడు. తనతో సన్నిహితంగా ఉండాలని భర్తను వదిలేసి తనతో రావాలని వేధించాడు. భర్తపేరున ఉన్న ఆస్తిని తనపేరున రిజిస్టర్ చేయాలంటూ డిమాండ్ చేసేవాడు. అక్కడితో ఆగని రియాజ్ తనతో సంబంధం పెట్టుకోకుంటే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానని, భర్తతో పాటు నిన్ను కూడా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వేధింపులు భరించలేని మహిళ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన స్టోరీ అంతా పోలీసులకు వివరించడంతో వెంటనే స్పందించిన పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

    టెన్త్ క్లాస్ చదివి రోజుల్లో ఏర్పడిన సాన్నిహిత్యం చివరకు వేధింపులకు దారితీసింది. మూడేళ్లపాటు మహిళకు నరకం చూపిన యువకుడు చివరకు కటకటాల పాలయ్యాడు. పెళ్లైన మహిళలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.., ఎంత తెలిసిన వాడైనా ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుంటే ఇలాంటి వేధింపులు ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Crime, Crime news, Harassment on women, Telugu news, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు