Home /News /crime /

VIJAYAWADA LADY VERY DANGEROUS SHE COLLECT 80 LAKS FROM ONE BUSINESS MAN NGS

Visakhapatnam: విశాఖలో యువతి హల్ చల్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు నిన్నేం జరిగింది? వాస్తవమేంటి..?

విశాఖ యువతి హల్చల్ కేసులో ట్విస్ట్

విశాఖ యువతి హల్చల్ కేసులో ట్విస్ట్

విశాఖలో యువతి హల్ చల్ కేసులో వాస్తవం ఏంటి..? పోలీసుల తీరుపై నిరసన తెలిపిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ పోలీసులు మాత్రం తమ తప్పేం లేదని.. యువతే కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారని అంటున్నారు.

  విశాఖపట్నంలో పోలీసులతో ఓ యువతి వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి ఫైన్ వేశారు అంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి హల్ చల్ చేసింది. లక్ష్మీ అపర్ణ అనే యువతి పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె స్నేహితుడు వచ్చి ఇంటికి తీసుకెళ్తుంటారు. అయితే కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. కానీ శనివారం ఆమెను తీసుకెళ్లడానికి స్నేహితుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ద్విచక్రవాహనాన్ని ఫొటో తీశారు. కాసేపటికి ఆ బైక్ కు ఫైన్ వేసినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఇంటికి వెళ్తున్న అపర్ణ వెనక్కివచ్చి పోలీసులను నిలదీశారు. ఆమె పోలీసులను నిలదీస్తూ కన్నీరు పెట్టుకోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  తాజాగా ఈ ఘటనపై పోలీసులు తమ వాదన వినిపించారు. అసలు ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని ట్విస్ట్ ఇచ్చారు. అసలు యువతితో పోలీసులు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో ఆమెను తమ సిబ్బంది పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారని వివరించారు. కానీ ఆమె లేనిపోని రాద్ధాంతం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతిపై పోలీసులు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమెను స్టేషన్‌లో ఉంచలేదని, నోటీసు ఇచ్చి పంపించివేశామని తెలిపారు. ఎవరి మాటలూ పట్టించుకోకుండా ఎస్‌పై.. లక్ష్మీ అపర్ణ కేకలు వేసిందని మహిళా కానిస్టేబుళ్లు మీడియాకు తెలిపారు.

  అసలు నిన్న ఏం జరిగిదంటే..పోలీసులకు యువతి వాదన పూర్తి భిన్నంగా ఉంది. కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చేందుకు తనకు అనుమతి ఉన్నప్పుడు తన వాహనంపై ఎలా ఫైన్  విధిస్తారని వాగ్వాదానికి దిగారు. అలా ప్రశ్నించినందుకు తన ఫోన్ లాక్కున్నారని.. అడ్డుకునే ప్రయత్నం చేస్తే  మహిళా పోలీసులు బలవంతంగా స్టేషన్ కు ఎత్తుకొని వెళ్లే ప్రయత్నం చేశారని ఆమె అంటున్నారు.  తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని వారిని ప్రతిఘటించారు. ఆమెకు మద్యం పరీక్షలు చేయించాలంటూ సీఐ అప్పారావు పేర్కొనడంతో ‘మీరే మద్యం తాగారేమో! పని లేకుండా రోడ్డుపై తిరిగేవాళ్లను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేంటి?’ అంటూ అపర్ణ మండిపడ్డారు. అవసరమైతే తాను కూడా మద్యం పరీక్షలు చేయించుకుంటానంటూ సీఐ అప్పారావు పేర్కొన్నారు. ప్రతిరోజూ తన వాహనానికి జరిమానా విధిస్తే జీతమంతా అవి చెల్లించడానికే సరిపోతుందంటూ అపర్ణ కన్నీరుమున్నీరయ్యారు. మహిళా పోలీసులతో ఆమె తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలుస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు