Home /News /crime /

VIJAYAWADA FIRE ACCIDENT DR RAMESH BABU MOVES METROPOLITAN COURT FOR ANTICIPATORY BAIL

Vijayawada fire accident: డాక్టర్ రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం

Vijayawada fire accident: విజయవాడలోని రమేష్ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం కేసులో ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు కోర్టును ఆశ్రయించారు.

    విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం కేసులో ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో స్వర్ణ ప్యాలస్ హోటల్‌ను రమేష్ హాస్పిటల్ లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా నడుపుతూ వచ్చింది. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఈ నెల 9న ఏర్పడిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 10 మంది కోవిడ్ బాధితులు మంటల్లో చిక్కుకుని మరణించారు. తగిన అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోనందునే ఈ ప్రమాదం జరిగిందంటూ డాక్టర్ రమేష్ బాబు సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

    ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ డాక్టర్ రమేష్ బాబు మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదావేసింది. ఈ కేసులో అరెస్టైన మిగిలిన నిందితుల బెయిల్ పిటిషన్లను కూడా ఆ రోజున విచారణ జరపనుంది.

    హీరో రామ్‌కు చంద్రబాబు బాసట..

    ఇదిలా ఉండగా విజయవాడలోని రమేష్ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాద ఘటన విషయంలో టాలీవుడ్ హీరో రామ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు బాసటగా నిలిచారు. హీరో రామ్‌పై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. ఏసీపీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరం చెప్పారు. అగ్ని ప్రమాద ఘటనపై తాము జరుపుతున్న విచారణకు అడ్డు తగిలితే...అవసరమైతే హీరో రామ్‌కు కూడా నోటీసులు జారీ చేసేందుకు వెనుకాడబోమని ఏసీపీ హెచ్చరించడంపై స్పందించడం తెలిసిందే.
    Published by:Janardhan V
    First published:

    Tags: Vijayawada Fire Accident

    తదుపరి వార్తలు