Home /News /crime /

VIJAYAWADA CRIME NEWS GUN MISS FIRED HOME GUARD WIFE SPOT DEAD GNT NGS

Andhra Pradesh: భార్య సరదా పడిందని గన్ చూపించిన హోం గార్డ్. కానీ తరువాత ఏం జరిగిందో తెలుసా

బెజవాడలో మిస్ ఫైర్ అయిన గన్, హోం గార్డు భార్య మృతి,

బెజవాడలో మిస్ ఫైర్ అయిన గన్, హోం గార్డు భార్య మృతి,

గన్ చూడాలి అనుకుంటే తప్పు లేదు.. కానీ బుల్లెట్ చూడాలి అనుకుంటే చచ్చిపోతావ్.. ఇది అతడు సినిమాలోని ఓ డైలాగ్.. అది నిజమే విజయవాడలోని ఇలాంటి విషాద ఘటనే ఒకటి జరిగింది. గన్ ను చూడాలనుకున్న ఓ భార్య సరదా ప్రాణాలు తీసింది.

    కొందరి సరదా ఒక్కోసారి ప్రమాదాలకు దారి తీస్తుంటుంది. సరదా కోసం కాస్త నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనే విజయవాడలోని గొల్లపూడిలో విషాదం నింపింది. సాధారణంగా తుపాకీని చూస్తే ఎవ్వరైనా భయపడతారు. అయినా చాలామంది ఒక్కసారైనా దగ్గర నుంచి ఆ తుపాకీని చూడాలని కోరికుంటూ ఉంటారు. ఎందుకంటే తుపాకీని దగ్గరగా చూసే అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. సినిమాల్లోనూ, టీవీల్లోనూ మాత్రమే కనిపించే తుపాకీలు.. నిజంగా ఎలా ఉంటాయో చూడాలనే కోరిక చాలామందిలో ఉండడం సహజం కానీ అది సాధ్యం కాదు.

    అలాగే ఓ హోం గార్డు భార్య కూడా తుపాకీ ఎలా ఉంటుంది? ఎలా పని చేస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంది. అయితే హోం గార్డుల దగ్గర తుపాకీలు ఉండవు.. కానీ బెజావాడలో ఓ హోం గార్డు భార్య సరదా.. అమె ప్రాణాలను తీసింది. ఇంతకీ ఏం జరిగిదంటే. హోంగార్డ్ తన భార్య కోరిక మేర సరదాగా తుపాకీ చూపిస్తుండగా అది ఒక్కసారిగా మిస్ ఫైర్ అయ్యింది. అందులో బుల్లెట్ భార్య సూర్య రత్నప్రభ గుండెళ్లోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

    ఈ విషాద ఘటన బెజవాడలో గొల్లపూడిలో చోటు చేసుకుంది. అయితే హోం గార్డు దగ్గరకు తుపాకీ ఎలా వచ్చిందని డౌట్ పడుతున్నారా? సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఏఎస్పీ శశికాంత్ దగ్గర వినోద్ అనే వ్యక్తి అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎఎస్పీకి నమ్మకస్తుడిగా వినోద్ ఉంటూ వచ్చాడు. ఇటీవల ఎఏసీ క్యాంప్‌కు వెళ్లాడు. అలా క్యాంప్ పనిమీద అనంతపురం వెళ్లిన ఏఎస్పీ తుపాకీని హోంగార్డుకు ఇచ్చాడు. ఆ తుపాకీని తన భార్యకు చూపిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని హోంగార్డ్‎ను విచారిస్తున్నారు.

    సాధరణంగా హోం గార్డుకు తుపాకీ ఇవ్వడం అన్నది నేరం.. ఒకవేళ ఎఎస్పీ అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్తే.. తుపాకీ వెంట పట్టుకుని వెళ్లాలి లేదా సరెండర్ చేయాలి.. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా హోంగార్డుకు ఎందుకు తుపాకీ ఇచ్చారంటూ మృతురాలి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైతం.. నిజంగా గన్ మిస్ ఫైర్ అయ్యిందా? వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? వారు ఇటీవల ఇంట్లో ఎలా ఉంటున్నారు అని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అదికూడా గన్ తెల్లవారు జామున రెండు గంటల సమయంలో గన్ మిస్ ఫైర్ అయ్యిందని చెబుతుండడం మరిన్న అనుమానాలకు తావిస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు