Home /News /crime /

VIJAYAWADA CRIME NEWS GUN MISS FIRE CASE UPDATE SHOCKING TWIST GNT NGS

Andhra Pradesh: గన్ మిస్ ఫైర్ కేసులో ఊహించని ట్విస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నది అందుకేనా?

గన్ మిస్ ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్

గన్ మిస్ ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్

విజయవాడలో గన్ మిస్ ఫైరింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య సరదా పడిందని గన్ చూపిస్తుంటే మిస్ ఫైర్ అయ్యిందని ఉదయం హోం గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వివాహం చేసుకున్న హొంగార్డు ఇలా ఎందుకు చేశాడన్నది అర్థం కాలేదు అంటున్నారు అతడి సన్నిహితులు.

ఇంకా చదవండి ...
  కృష్ణా జిల్లాలోని విజయవాడలో గొల్లపూడిలో తుపాకీ మిస్ ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మొదట హోం గార్డు చెప్పిన మాటల ప్రకరాం. తన భార్య సరదా పడితే.. తుపాకీని చూపించానని.. అలా చూపించినప్పుడు ప్రమాదం జరిగింది అంటూ చెబుతూ వచ్చాడు. అందరూ అదే నిజం అనుకున్నారు. కానీ పోలీసులు విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

  పశ్చిమగోదావరికి చెందిన వినోద్ అనే హోం గార్డు గొల్లపూడిలో ఉంటున్నాడు. ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఓ ఏఎస్పీ  దగ్గర అసిస్టెంట్ గా ఉంటున్నాడు. ఆయనకు మంచి నమ్మకస్తుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఒక క్యాంప్ పనిమీద ఏఎస్పీ అనంతపురం వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన తను తుపాకీని వినోద్ కు ఇచ్చి వెళ్లారు. అలా ఇంటికి తెచ్చిన తుపాకీని.. తన భార్య చూపించమని కోరిందని.. ఆమె సరదా పడింది కదా అని తుపాకీని చూపిస్తుంటే.. మిస్ ఫైర్ అయ్యిందని.. దీంతో గన్ లోని బుల్లెట్టు ఆమె గుండెల్లోకి దూసుకెళ్లిదంటూ వినోద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. బుల్లెట్టు నేరుగా గుండెలోకి దూసుకెళ్లడంతో సూర్యరత్న ప్రభ అక్కడికక్కడే మృతి చెందింది.

  గన్ మిస్ ఫైర్ అవ్వడంతోనే తన భార్య చనిపోయిందని చెప్పడంతో హుటాహుటానికి ఘటనా స్థలానికి వచ్చిన భవానీపురం పోలీసులు. ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సాధరణంగా హోం గార్డుకు తుపాకీ ఇవ్వడం అన్నది నేరమని.. ఒకవేళ ఎఎస్పీ అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్తే.. తుపాకీ వెంట పట్టుకుని వెళ్లాలి లేదా సరెండర్ చేయాలి.. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా హోంగార్డుకు ఎందుకు తుపాకీ ఇచ్చారంటూ మృతురాలి బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఘటన అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగిందని చెప్పడంతో.. పోలీసులకు అనుమానం పెరిగింది. నిజంగానే గన్ మిస్ ఫైర్ అయ్యిందా? వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? వారు ఇటీవల ఇంట్లో ఎలా ఉంటున్నారు అని అన్ని కోణాల్లో విచారణ చేస్తే.. నమ్మలేని నిజాలు బయట పడ్డాయి.

  క్షణికావేశంలో హోంగార్డే భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఓ ఏఎస్పీ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడని. మూడు రోజుల క్రితం ఏఎస్పీ అనంతపురం వెళ్లారని.. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారని వెల్లడించారు. అయితే దాన్ని ఇంటికి తీసుకొచ్చిన హోంగార్డు మొదట ఇంట్లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయినట్లు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడన్నారు. తుపాకీలోని బుల్లెట్ అతడి భార్య సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఏడుస్తూ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ తమ విచారణలో భార్యను బెదిరించే క్రమంలోనే ఆ తుపాకీతో హోంగార్డు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసిందన్నారు. అయితే గత అర్ధ రాత్రి భార్యభర్తల ఆ విషయంలోనే గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నామన్నారు.

  ప్రస్తుతం కేసు విచారణలో ఉందని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు వివరించారు. ఏదీ ఏమైనా ఉదయం మిస్ ఫైర్ అయిందని నమ్మించిన హోం గార్డు తెలివితేటలు చూసి అంతా షాక్ అవుతున్నారు. కేవలం బంగారు నగల కోసం భార్యను అంత దారుణంగా హత్య చేస్తాడా.. మరి అలాంటప్పుడు ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని చుట్టుపక్కల ఇళ్లవాళ్లు ప్రశ్నిస్తున్నారు. మృతురాలి బంధువులు మాత్రం హోం గార్డును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ అంటు వెంటపడి పెళ్లి చేసుకుని ఇప్పుడు హత్య చేయడం దారుణమంటూ రోధిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు