రాశీ, రంభకు షాక్... విజయవాడ కోర్టు ఆదేశాలు

అంతేకాదు రాశీ రంభకు కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. సెలబ్రిటీస్ అయిన రాశీ, రంభ లాంటి హీరోలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదన్నారు.

news18-telugu
Updated: September 29, 2019, 10:37 AM IST
రాశీ, రంభకు షాక్... విజయవాడ కోర్టు ఆదేశాలు
హీరోయిన్ రాశి , రంభ
  • Share this:
టాలీవుడ్ ఒకప్పటి ప్రముఖ హీరోయిన్లు అందాల రాశి, సెక్సీ రంభకు కోర్టు షాకిచ్చింది. కలర్స్ అనే సంస్థలో వారిద్దరూ చేసిన వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయోద్దంటూ విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని వెంటనే ఆపేయాలని ఆదేశించింది. రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసారమాద్యమాలలో కలర్స్ అనే సంస్ధ నిర్వహిస్తున్న ప్రకటనలు నిలుపదల చేయాలని కన్స్యూమర్ కోర్ట్ పేర్కొంది.

కలర్స్ వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోసపోయిన వినయోగదారుడి జస్టీస్‌ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు. అంతేకాదు రాశీ రంభకు కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. సెలబ్రిటీస్ అయిన రాశీ, రంభ లాంటి హీరోలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రెటీస్ కు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
Published by: Sulthana Begum Shaik
First published: September 29, 2019, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading