Home /News /crime /

VIJAYAWAD PINS APP IDENTIFIED BIKE THEFT WITH FINGER PRINTS IN GUNTUR CITY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: వేలి ముద్ర మ్యాచ్ అయిందో అంతే సంగతులు.. దొంగను పట్టించిన మొబైల్ యాప్.. ఎలాగంటే..!

బైక్ ను చోరీ చేస్తున్న దొంగ (ప్రతీకాత్మక చిత్రం)

బైక్ ను చోరీ చేస్తున్న దొంగ (ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులకు టెక్నాలజీ బాగా సాయపడుతోంది. ఓ యాప్ సాయంతో పాతనేరస్తుల గుర్తింపు సులభమవుతోంది.

    రు సూపర్ సినిమా చూశారా.. అందులో బ్రహ్మానందం.. ఆలీతో నిజం చెప్పించడానికి లై డిటెక్టర్ ని వినియోగిస్తాడు. అలీ అబద్ధం చెప్పిన వెంటనే ఆ మెషీన్ గట్టిగా అరుస్తుంది. సేమ్ అలాంటి సీనే రియల్ గా చోటు చేసుకుంది. ఇక్కడ ఓ దొంగను.. మొబైల్ యాప్ గుర్తించింది. బైక్ దొంగను పట్టించింది. పోలీసుల పనిని సులభం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు నగరంలో ఇటీవల అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పోలీసులకు డౌట్ రావడంతో అతడ్ని ప్రశ్నించారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి వస్తున్నాన... దగ్గర్లోనే నివాసముంటున్నాని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఐతే పోలీసులకు మాత్రం అతడు చెప్పే విషయాలు నమశక్యంగా లేవనిపించింది. వెంటనే మొబైల్ లో ఉన్న పిన్స్ యాప్ ఓపెన్ చేసి వేలిముద్ర తీసుకున్నారు. అంతే యాప్ సౌండ్ చేయడం మొదలు పెట్టింది. అంతే మనోడ్ని పట్టుకొని గట్టిగా ప్రశ్నించారు.

    పాతనేరస్తుల జాబితాలో నీ వేలిముద్రులున్నాయి... ఇక్కడ ఏం చేయడానికి వచ్చావని పోలీసులు ప్రశ్నించారు. దీంతో గతంలో ఓ బైక్ దొంగిలించానని.. ఇప్పుడు మారిపోయానని చెప్పాడు. పోలీసులు మాత్రం తమదైన శైలిలో విచారించేసరకి అసలు విషయం చెప్పాడు. తాను ఎనిమిది బైకులను దొంగింలించానని.. ఇప్పుడు కూడా బైక్ దొంగతనం కోసమే వచ్చినట్లు వివరించాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు. ఎవరికి విక్రయించాడు..? అతడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. మొత్తానికి ఏపీ పోలీసు శాఖ ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన పిన్స్ యాప్ దొంగను మాత్రం భలే పట్టించింది.

    పిన్స్ యాప్ అంటే..!
    పోలీస్ శాఖలో టెక్నాలజీని పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ యాప్ ను అమల్లోకి తీసుకొచ్చింది. యాప్ ద్వారా వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు వివరాలు ఇందులో ఉంటాయి. అలాగే పాతనేరస్తులకు సంబంధించిన వేలిముద్రలు, ఇతర సమాచారాన్ని పొందుపరుస్తారు. ఇది నిత్యం ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ లో ఎవరైనా పాతనేరస్థుడిని పట్టుకొని వేలిముద్రలను అఫ్పటికప్పుడు చెక్ చేయవచ్చు. అందులోని రికార్డ్స్ తో వేలిముద్రలు సరిపోతే వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుంటారు. పోలీస్ స్టైల్లో ప్రశ్నిస్తే చేసిన దొంగతనాలతో పాటు చేయబోయో నేరాల ప్లాన్ వివరిస్తారు. ఆ విధంగా టెక్నాలజీ సాయంతో నేరాలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కేసులను యాప్ ద్వారానే ఛేదించారు. ఇలాంటి యాప్స్ ద్వారా సమయంతో పాటు శ్రమ కూడా తగ్గుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Bike theft, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు