కాంగ్రెస్ నాయకురాలు దారుణహత్య... చంపేసి, కృష్ణానది ఒడ్డున పడేసిన దుండగులు...

కోల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణ నదీ తీరంలో శవమై కనిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడకనూర్... విజయపుర జిల్లా జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన రేష్మా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 4:37 PM IST
కాంగ్రెస్ నాయకురాలు దారుణహత్య... చంపేసి, కృష్ణానది ఒడ్డున పడేసిన దుండగులు...
కాంగ్రెస్ నాయకురాలు రేష్మా
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 4:37 PM IST
కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడకనూర్ దారుణ హత్యకు గురయ్యారు. విజయపుర జిల్లా జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన రేష్మా... ఆ తర్వాత పదవి నుంచి తప్పుకున్నారు. గురువారం పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో బయటికి వెళ్లింది రేష్మా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అనే వివరాలు తెలియరాలేదు. కోల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణ నదీ తీరంలో రేష్మ శవమై కనిపించింది. ఆమెను దారుణంగా హత్య చేసిన దుండగులు... శవాన్ని నదీ తీరంలో పడేసి పారిపోయారు. హత్య కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు జేడీఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు రేష్మా. 2013 జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించిన రేష్మాకు ఆ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. వేరే వ్యక్తికి సీటు కేటాయించడంతో ఆగ్రహానికి గురైన రేష్మా... గత అసెంబ్లీ ఎన్నికల ముందు విజయపుర జేడీఎస్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుని, కాంగ్రెస్ పార్టీలో చేరారు.
congress, congress party seats 2019 elections, karnataka assembly elections 2019, lok sabha elections 2019, congress leader reshma padekanura, vijayapura dist, vijayapura leader, jds party,congress paty president, latest telugu news, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీట్లు 2019, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలి హత్య
రేష్మా మృతదేహం, పక్కన ఆమె పాత ఫోటో


2013లో జేడీఎస్ పార్టీ ఓటమికి రేష్మా ప్రచారం కూడా ఓ కారణం. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె.... ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా హత్యకు గురి కావడంతో అనుమానాలు రేగుతున్నాయి.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...