Vijay Mallya: విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఊహించని షాక్.. ఆస్తుల వేలానికి లైన్ క్లియర్

విజయ్ మాల్యా (ఫైల్)

ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కథ క్లైమాక్స్ చేరింది. తాజాగా లండన్ కోర్టు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకుల పోరాటానికి భారీ ఊరట కల్పించే తీర్పు ఇచ్చింది.

  • Share this:
    భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఊహించని షాక్ ఇచ్చింది లండన్ కోర్టు.. మాల్యాను భారత్‌ కు అప్పగింత కేసును సోమవారం విచారించిన కోర్టు ఆయన దివాళా తీసినట్లు సంచలన ప్రకటన చేసింది. లండన్ కోర్టు తాజా ఉత్తర్వులతో మాల్యా స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని వాటి వేలం ద్వారా బ్యాంకులు తమ రుణాలను జమ చేసుకోవచ్చు. ఈ ప్రకటన భారతీయ బ్యాంకులకు పెద్ద ఊరట అనే చెప్పాలి. ఇండియాలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తాజా ఆదేశాలతో కొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు అతి పెద్ద విజయం దక్కినట్లయింది.

    అయితే మరో షాక్ ఏటంటే.. తాజా తీర్పుపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను లండన్ హైకోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో మాల్యా కథ క్లైమాక్స్ కు చేరినట్టే అయ్యింది. భారత్ కు తిరిగి రావడం తప్ప వేరే మార్గం లేదు.. అన్ని దారులు దాదాపు మూసుకుపోయినట్టే అంటున్నారు ఆర్థిక నిపుణులు..

    మొత్తం 9000 కోట్లకు పైగా బ్యాంకులకు బకాయీలు పడటంతో కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా స్వదేశం విడిచి, లండన్ లో తలదాచుకుంటున్నాడు. ఇకపై ఎంతో కాలం లండన్ లో ఉంటే అవకాశం లేదు. తాజా తీర్పును భారతీయ బ్యాంకులకు అనుకూలంగా ఉందంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు. మాల్యా ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకునేందుకు అన్ని రూట్స్ ఇక క్లియర్ అయినట్టే భావిస్తున్నారు. ఇక మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తైనట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అంతలోనే మాల్యాను దివాలా తీసినట్లు లండన్ కోర్టు ప్రకటించడం గమనార్హం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published: