హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Viral photo: సోషల్ మీడియాలో విజయ్‌మాల్యా ఫోటో షేర్ చేసిన సిద్దార్ధ్ మాల్యా .. మండిపడుతున్న నెటిజన్లు

Viral photo: సోషల్ మీడియాలో విజయ్‌మాల్యా ఫోటో షేర్ చేసిన సిద్దార్ధ్ మాల్యా .. మండిపడుతున్న నెటిజన్లు

vijay mallya(Photo:Instagram)

vijay mallya(Photo:Instagram)

Viral photo: బ్యాంకులకు వేల కోట్లు బాకీ చెల్లించకుండా తాను ఎప్పటికి లక్ష్మీ పుత్రుడ్నే అన్నట్లుగా స్టైల్‌గా బిల్డప్‌ ఇస్తున్న విజయ్‌మాల్యా ఫోటోలను స్వయంగా ఆయన కుమారుడు సిద్దార్ధ్‌మాల్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలో బ్యాంకుల్ని బురిడి కొట్టించి వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న కింగ్‌ఫిషర్‌(Kingfisher)సంస్థ కింగ్ విజయ్‌మాల్యా (Vijay mallya)ఫోటోలు మరొకసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బ్యాంకులకు వేల కోట్లు బాకీ పడి చెల్లించనందుకు కోర్టులు సైతం శిక్షలు, జరిమానాలు విధిస్తూ తీర్పిచ్చినప్పటికి అతనిలో పశ్చాత్తాపం, పరివర్తన రాకపోలేదు కదా .. తాను ఎప్పటికి లక్ష్మీ పుత్రుడ్నే అన్నట్లుగా స్టైల్‌గా బిల్డప్‌ ఇస్తున్న ఫోటోలను స్వయంగా ఆయన కుమారుడు సిద్దార్ధ్‌మాల్యా(Siddhar mallya) ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు(Netizens) మండిపడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దర్నీ కలిపి దొంగల్లారా మీ అడ్రెస్ ఎక్కడా అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వార్తే నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Cold Wave: ఢిల్లీలో చలి బీభత్సం.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి ఎంజాయ్..

భారతదేశంలో ఆర్దిక నేరస్తుల చిట్టాలో మొదటగా వినిపించే పేరు విజయ్‌మాల్యా. కింగ్‌ ఫిషర్‌ సంస్థల పేరుతో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకుల నుంచి సుమారు 9వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. వాటిలో కొంత విదేశాల్లో ఉన్న తన పుత్ర రత్నం సిద్ధార్ధ్‌ మాల్యా, కూతుళ్లు లియానా మాల్యా, తాన్యా మాల్యాకు 40మిలియన్ డాలర్లను బదిలీ చేశారు. ఈకేసులు చాలదంటూ బ్యాంకుల్లో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ పేరుతో తీసుకున్న రుణాలు ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా విజయ్‌మాల్యా దర్జాగా ఉన్నారని ..ఎలాంటి చీకు, చింత లేకుండా ఫ్యామిలీతో ఆనందంతో గడుపుతోందని ఆయన కుమారుడు సిద్దార్ద్ మాల్యా ఓ ఫోటోని తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోపైనే నెట్టింట్లో రచ్చ నడుస్తోంది.

విజయ్‌మాల్యాపై తిట్ల దండకం..

భారతదేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో తలచాకుంటున్న విజయ్‌మాల్యాను పట్టుకోమని...అతడ్ని కావాలనే కాపాడుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో ఇప్పటికి కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. అలాంటి సందర్భంలో మరోసారి తండ్రి విజయ్‌మాల్యా, కొడుకు సిద్ధార్ద్ మాల్యా నవ్వుతున్న ఫోటో సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. చోర్‌ సాలా అంటూ ఒకరు, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లక్ష్మీ చిట్‌ ఫండ్ అంటూ మరో నెటిజన్, చోర్‌ కా బేట చోర్‌ అంటూ మరొక సోషల్ మీడియా ఫాలోవర్ తిట్టిపోస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

భారతదేశంలోనే అగ్రశ్రేణి బ్యాంక్‌గా ముద్రపడిన ఎస్‌బీఐ మీ లొకేషన్ అడుగుతోందని కొందరు..నాకు ఇవ్వాల్సిన 5000వేలు ఎక్కడరా భడ్వే అంటూ మరికొందరు విజయ్‌మాల్యా, సిద్ధార్ద్ మాల్యాను తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, శిక్షలనే లెక్క చేయని ఇలాంటి ఆర్ధిక నేరగాళ్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టే చివాట్లతో ఎలా మారతారని ఆర్ధికవేత్తలు, మేధావులు కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: National News, Vijay Mallya, Viral photos

ఉత్తమ కథలు