VIJAY MALLYA NEXT TARGET AFTER NIRAV MODI ARREST IN LONDON
Nirav Modi Arrest : నీరవ్ మోడీ అరెస్టయ్యారు..ఇక తరువాత టార్గెట్ విజయ్ మాల్యాయేనా ?
విజయ్ మాల్యా
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇప్పటికే పలుమార్లు లండన్ కోర్టులో హాజరుకాగా, మాల్యాను భారత్ రప్పించేందుకు అధికారులు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల కన్సార్షియం సైతం విజయ్ మాల్యాను ఎట్టి పరిస్థితుల్లో భారత్ రప్పించాల్సిందే అని పట్టుబడుతోంది.
లండన్లో ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ అరెస్టు తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మరో ఆర్థిక కేటుగాడు విజయమాల్యాపైనే ఉంది. దాదాపు తొమ్మిది వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను స్వదేశానికి తేవడం పైనే కేంద్రం గురి పెట్టిందా అనే సందేహాలు బలపడుతున్నాయి. వేలాది కోట్లతో విదేశాలకు ఉడాయించిన ఆర్థిక నేరగాళ్లను పీచమణించేందుకు ఇప్పటికే ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు-2018 గత సంవత్సరం పార్లమెంటులో ఆమోదం పొందింది. మనీలాండరింగ్ సంబంధిత ఆర్థిక నేరాల కట్టడి కోసం ఉద్దేశించిన ఈ బిల్లు ద్వారా ప్రత్యేక కోర్టు ఏర్పాటు, అలాగే ఆస్తుల జప్తు చేపడతామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందులో భాగంగానే నీరవ్ మోడీపై తొలి అస్త్రాన్ని ప్రయోగించగా అది సఫలమైంది. నీరవ్తో పాటు విదేశాలకు చెక్కేసిన ఆయన మేనమాము మేహుల్ చోక్సీని సైతం తమకు స్వాధీనపరచాల్సిందిగా ఆంటిగ్వా కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే త్వరలో మెహూల్ చోక్సీ కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ మాల్యా (ఫైల్ ఫోటో )
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇప్పటికే పలుమార్లు లండన్ కోర్టులో హాజరుకాగా, మాల్యాను భారత్ రప్పించేందుకు అధికారులు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల కన్సార్షియం సైతం విజయ్ మాల్యాను ఎట్టి పరిస్థితుల్లో భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ సహా మొత్తం 31 మంది ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోయినట్లు ఇప్పటికే భారత విదేశాంగశాఖ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. అయితే తాజాగా ప్రవేశపెట్టిన ఆర్థిక నేరస్తుల చట్టం ఫలితంగా అధికారులు ఆర్థిక నేరగాళ్లను భారత్ రప్పించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే నీరవ్ మోడీ తర్వాత మాత్రం తరువాత టార్గెట్ విజయ్ మాల్యాయే అనే వాదన బలం పుంజుకుంటోంది.
నీరవ్ మోడీ అరెస్టు బీజేపీకి బూస్టేనా ?:
మరోవైపు వరుసగా ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోవడంతో అప్రతిష్ట మూటగట్టుకున్న మోడీ ప్రభుత్వానికి నీరవ్ మోడీ అరెస్టు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఒక వైపు చౌకీదార్ కాంపెయిన్ ను మోడీ జోరుగా ప్రజల్లోకి తీసుకువెళుతున్న నేపథ్యంలో నీరవ్ మోడీ అరెస్టు ప్లస్ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.