Home /News /crime /

Vigilance raids:  కానిస్టేబుల్​ ఇంటిపై విజిలెన్స్​ దాడులు.. ఆస్తులు చూసి అధికారుల షాక్​.. ఎంత దొరికిందంటే..

Vigilance raids:  కానిస్టేబుల్​ ఇంటిపై విజిలెన్స్​ దాడులు.. ఆస్తులు చూసి అధికారుల షాక్​.. ఎంత దొరికిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ కానిస్టేబుల్ ఆస్తులు చూసి విజిలెన్స్​ అధికారులు షాక్​కు గురయ్యారు.  అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో ఒరిస్సాలోని కానిస్టేబుల్‌ సురేంద్ర ప్రధాన్‌ ఇళ్లపై విజిలెన్స్‌ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు

  ఓ కానిస్టేబుల్ (Constable) ఆస్తులు చూసి విజిలెన్స్​ అధికారులు (vigilance officials) షాక్​కు గురయ్యారు.  అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో ఒరిస్సాలోని (Odisha) కానిస్టేబుల్‌ సురేంద్ర ప్రధాన్‌ (Surendra Pradhan) ఇళ్లపై విజిలెన్స్‌ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు (Raids) చేశారు. దాదాపు రూ. 2.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు మూడు వేర్వేరు ప్రాంతాల్లోని కానిస్టేబుల్‌ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టిన అధికారులు కానిస్టేబుల్​ కూడ బెట్టిన ఆస్తులను చూసి షాక్​ అయ్యారు. దాడుల్లో పలు విలువైన దస్త్రాలు, బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు (bank passbooks), చెక్‌బుక్‌లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విజిలెన్స్‌ ఎస్పీ త్రిలోచన్‌ స్వంయి తెలిపారు.

  అధికారులకు సమాచారం..

  ఒరిస్సాలోని గంజాం జిల్లా, బంజనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సురేంద్ర ప్రధాన్‌ కానిస్టేబుల్‌ (constable)గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు  ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని విజిలెన్స్​ అధికారులకు సమాచారం అందింది. అవన్నీ అక్రమంగా సంపాదించినవేనన్న సమాచారం మేరకు కటక్‌ విజిలెన్స్‌ అధికారులు (vigilance officials) అప్రమత్తమై, దాడులు చేపట్టారు.

  ఉదయం జరిగిన అధికారుల దాడుల్లో (Vigilance raids) కానిస్టేబుల్‌కి బరంపురంలోని లుచ్చాపడలో 3 అంతస్తుల భవనం, నిమ్మఖండి గ్రామంలో మరో మూడు అంతస్తుల భవనం, గురింటి గ్రామంలో రెండంతస్తుల భవనం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కానిస్టేబుల్‌ బంధువుల ఇళ్లల్లో సైతం అధికారులు తనిఖీలు చేపట్టారు.

  గతంలో ప్రొద్దుటూరులో ..

  గతంలో ఏపీలోని ప్రొద్దుటూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ హెడ్‌కానిస్టేబుల్‌ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ప్రొద్దుటూరులో హెడ్‌ కానిస్టేబుల్‌ చిన్న వీరయ్య ఇళ్లపై ఏసీబీ అధికారులు  దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరుతోపాటు కడప, బెంగళూరులోని అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిగాయి.

  ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్‌లో నివాసం ఉంటున్న చిన్న వీరయ్య బి.మఠం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నాడని సమాచారం రావడంతో జిల్లా ఏసీబీ డీఎస్పీ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్, లైట్‌పాలెం, శ్రీనివాసనగర్, జేమ్స్‌కొట్టాలలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిన్న వీరయ్య 1993లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. ప్రొద్దుటూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2013లో హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ పొంది బి.మఠం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు.

  ఏసీబీ దాడుల్లో రూ.7 కోట్ల మేర హెడ్‌కానిస్టేబుల్‌ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో 6 సెంట్లలో ఇళ్లు, మోడంపల్లెలోని జేమ్స్‌పేటలో 5 సెంట్లలో ఇటీవలే నిర్మించిన విలాసవంతమైన భవంతి, చాపాడు మండలంలో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, త్యాగరాజనగర్‌లో అరసెంటులో ఇల్లు, అనుమతి లేకుండా నిర్వహించే సంగీత పరికరాల దుకాణం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదు, బంగారం, స్థిరాస్తుల విలువ సుమారు రూ.7కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: ACB, Bhuvaneshwar, Odisha, Police

  తదుపరి వార్తలు