Woman Push Child To Train Track : యునైటెడ్ స్టేట్స్(USA)లోని ఒరెగాన్‌లో ఒక మహిళ ఒక చిన్న అమ్మాయిని రైలు పట్టాలపైకి(Train Track) తోస్తున్నట్లు చూపించే భయంకరమైన ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. బుధవారం (డిసెంబర్ 28,2022) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను ముల్ట్‌నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
అటార్నీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం..ఒరెగాన్ రైల్వే స్టేషన్(Oregon Railway Station) లో బుధవారం 3 సంవత్సరాల వయస్సు గల బాలిక ప్లాట్‌ఫారమ్‌పై తన తల్లితో రైలు కోసం వేచి ఉంది. మరికొన్ని నిమిషాల్లో రైలు పట్టాలపైకి వస్తుందన్న సమయంలో అకస్మాత్తుగా ఓ మహిళ తన చైర్ లో నుంచి లేచి వెళ్లి ఫ్లాట్ ఫాంపై త్లలి పక్కన నిలబడి ఉన్న చిన్నారిని రైలు పట్టాల మీదకి తోసేసింది. బాలికను నెట్టివేసిన తర్వాత తిరిగి వచ్చి కూర్చుంది. అయితే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ఇతర వ్యక్తులు వెంటనే స్పందించి రైలు పట్టాల నుండి చిన్నారిని పైకి లేపడానికి పరుగెత్తారు. రైలు రాకముందే వారిలో ఒక వ్యక్తి చిన్నారిని సురక్షితంగా ప్లాట్‌ఫారమ్‌పైకి లాగాడు. ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారిని పట్టాలపైకి తోసిన మహిళను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్‌మెన్‌గా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వర్క్‌మెన్ న కస్టడీలో ఉండాలని, బెయిల్ ఇవ్వకూడదని కోర్టును అభ్యర్థించినట్లు న్యాయవాది కార్యాలయం తెలిపింది. అయితే రైల్వే పట్టాలపై పడిన చిన్నారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
On Dec. 28 at the Gateway Transit Center in Portland, OR, a person shoved a toddler face-first into the train tracks. The suspect was apprehended. Antifa & far-left activists in the city have argued against police patrolling public transport, saying it endangers people. pic.twitter.com/uGBBMIraH1
— The Modern Patriot (@ModernPatriotWi) December 30, 2022
మరోవైపు,హిందువులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వేళ జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) లో దారుణం చోటు చేసుకుంది. హిందు కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేశారు. రాజౌరి(Rajouri) జిల్లా లోని ధాంగ్రి గ్రామంలో ఉగ్రవాదులు హిందువుల ఇళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురిని పొట్టనబెట్టుకున్నారు. జమ్మూ డివిజన్‌లోని రాజౌరీకి 10 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ ధంగ్రీ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ SUVలో వచ్చిన టెర్రరిస్టులు.. రామాలయం సమీపంలో ఉన్న మూడు హిందువుల ఇళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. సమాచారం అందిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. నిందితులని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక,ఉగ ఘటనలో గాయపడిన వారిని రాజౌరీలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా అప్పటికే ముగ్గురు చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. ట్రీట్మెంట్ పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని సతీశ్ కుమార్ (45), దీపక్ కుమార్ (23), ప్రీతమ్ లాల్ (57)గా గుర్తించారు. హాస్పిటల్‌లో మరణించిన వ్యక్తిని గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే ఇది జరిగి 12 గంటలైనా గడవకముందే సోమవారం మళ్ళీ టెర్రరిస్థులు ఇదే గ్రామంలో గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారు. నిన్న జరిగిన సంఘటనలో బాధిత కుటుంబం ఇంటిదగ్గరే ఈ పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, USA