విశ్వాసం ప్రదర్శించడం, దొంగల్ని తరిమివేయడంలో కుక్కలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే కుక్కలను గ్రామసింహాలని పిలుస్తారు. పూర్వం గ్రామాలు, పల్లెల్లో దొంగలు పడకుండా శునకాలనే కాపలా పెట్టే వాళ్లే. అవే ఊళ్లోకి ఎలాంటి దొంగలు చొరబడకుండా రాత్రి వేళల్లో కాపలా కాసేవి. అందుకే పోలీసు డిపార్ట్‌మెంట్(Police Department)లో కూడా కుక్కలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి మరీ క్లిష్టమైన హత్య కేసులు, రాబరీలు, చోరీ కేసుల్ని చేధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఓ కక్కూర్తి దొంగ(Thief)ను పోలీసులకు పట్టించింది పెంపుడు కుక్కdog. చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి పని పూర్తి చేసుకొని వెళ్లే క్రమంలో అది ఎదురుపడి అరవడం, కరిచేందుకు సిద్ధంగా ఉండటంతో దొంగ చోరీకి పాల్పడిన ఇంటి దగ్గర నుంచి కదల్లేకపోయాడు. పారిపోదామంటే కుక్క పిక్క పట్టుకుంటుందేమోనని భయం..ఉంటే ఇంటి యజమాని పట్టుకొని చితకబాదుతాడనే కంగారుపడుతూనే గోడపై నక్కి కూర్చున్నాడు. లఖింపూర్ ఖేరీ(Lakhimpur Kheri) జిల్లా కేంద్రంలో ఉన్న లూప్ కాలనీ(Loop Colony)లో దొంగల బెడద ఎక్కువ. డబ్బు, నగలు మొదల్కొని ఇంటి ఆవరణలో విలువైన వస్తువుల్ని కూడా మాయం చేస్తున్నారు. రోజూ ఏదో ఓ చోట ఇలాంటి చోరీలు జరుగుతుంటే దొంగల్ని పట్టుకోవడం పోలీసులకు కూడా కష్టంగా మారింది.
దొంగను చుచ్చు పోయించిన కుక్క..
నిత్యం చోరీలు జరగడం, డబ్బులు, విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లడంతో స్థానికులు కాలనీలో కుక్కలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి కూడా యధావిధిగా ఓ దొంగ చోరీకి వచ్చాడు. అది కూడా ధన్వంతి ఆస్పత్రిలో చోరీ చేశాడు. లోపలకు వెళ్లే అకాశం లేకపోవడంతో..గోడ దూకి అవుట్‌డోర్‌లో ఏర్పాటు చేసిన ఏసీ కనెక్షన్ తొలగించి దాన్ని ఎత్తుకెళ్లేందుకు కింద పడేశాడు. అర్ధరాత్రి ఓ యువకుడు వచ్చి ఏసీని ఎత్తుకెళ్లడం చూసిన కుక్కలు అతడు గోడపై నుంచి కిందకు దిగి పారిపోకుండా గట్టిగా మొరగడం ప్రారంభించాయి. పెంపుడు కుక్కలు అరవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దొంగ భయపడిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Uttar pradesh, Viral Video