మాతృ దేవోభవ.. ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. కన్న తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని ఎవరైనా గురువులకు ఇస్తారు. అలాంటి సంస్కృతి భారతదేశానికి ఉంది. గురువుని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తారు.. పూజిస్తారు కూడా. అయితే నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో కొంతమంది గురువుల విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చదువు చెప్పే ఉపాధ్యాయుడిని ఎగతాళి చేయడం.. కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఓ ఉపాధ్యాయుడు క్లాస్ రూంకి రాగానే.. కొంతమంది సభ్యసమాజం సిగ్గుపడేలా చేశారు. అతడిపై చెత్త బుట్ట పెట్టి.. అతడికి కించపరిచేలా వ్యవహరించారు.
ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఒక టీచర్‌తో కొంతమంది విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించి.. అతని తలపై డస్ట్‌బిన్‌ను ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ అంశంపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ వీడియో దావణగెరె జిల్లా చన్నగిరి పట్టణంలోని నల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినది. డిసెంబరు 3న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది.
విద్యార్థినుల్లో ఒకరు టీచర్‌పై డస్ట్‌బిన్‌తో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.
Karnataka: "Assault on teacher by students at a school in Channagiri taluk of Davanagere district cannot be tolerated. Education Dept & police probing the matter. Instructed to take appropriate action. We'll always be with teachers," BC Nagesh, Primary & Sec Education Min tweets pic.twitter.com/CLHr7XNUi1
— ANI (@ANI) December 10, 2021
తరువాత.. ఒక విద్యార్థి తరగతిలో బోధించడం ప్రారంభించినప్పుడు ఉపాధ్యాయుడి తలపై ఓ విద్యార్థి డస్ట్‌బిన్ వేస్తాడు. ఈ ఘటనపై ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పందిస్తూ.. ‘దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడిని సహించేది లేదని.. దీనిపై విచారణ చేస్తున్న విద్యాశాఖ, పోలీసులు.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము ఎల్లప్పుడూ.. ఉపాధ్యాయుల భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు.
In a viral video, some students were seen misbehaving with a senior teacher, assaulted him with a dustbin. "Assault on the teacher will not be tolerated. I've instructed to take appropriate action," tweets BC Nagesh, Primary & Sec Education Min
(Screengrab from the viral video) pic.twitter.com/Fw7RUu9nNp
— ANI (@ANI) December 10, 2021
దీనిపై సదరు ఉపాధ్యాయుడు స్పందించాడు. తాను తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు నేలపై చెత్తాచెదారం గుట్కా ప్యాకెట్లను చూశానని.. దీంతో ఇలాంటి పనులు చేయొద్దని.. విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలని కోరానని చెప్పాడు. ఇక గదిలో పాఠం చెప్పే సమయంలో కొంతమంది తన దాడి చేయడం ప్రారంభించారని.. తన తలపై డస్ట్ బిన్ వేసి.. విచిత్ర చేష్టలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Trending news