Home /News /crime /

VIDEO OF SOME YOUNG MENS DANCING IN A CAR IN UTTAR PRADESH HAS GONE VIRAL SNR

OMG:యూపీలో నడిరోడ్డుపై కుర్రాళ్ల న్యూసెన్స్..వాళ్లకేం పోయేకాలం..ఏం చేశారో ఈ వీడియో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Uttar Pradesh:యూపీలో ఓ కుర్రగ్యాంగ్‌ నేషనల్‌ హైవేపై రచ్చ చేసింది. మద్యం మత్తులో కారుపై డ్యాన్స్‌ చేస్తూ పబ్లిక్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. రోడ్డున పోయేవాళ్లు వాళ్ల ఓవర్‌ యాక్షన్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రచ్చరచ్చ అవుతోంది.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో కొందరు కుర్రాళ్లు చేసిన ఓవర్ యాక్షన్ మాములుగా లేదు. మద్యం మత్తులో నడిరోడ్డుపై చేసిన ఫీట్స్‌కు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఘజియాబాద్‌ Ghaziabad జిల్లా కొందరు యువకులు బీచ్‌ హైవే(Beach Highway)పై కారులో వెళ్తూ రచ్చరచ్చ చేశారు. నేషనల్ హైవే 9(National Highway) లాల్‌కువాన్‌ (Lalquan) ప్రాంతంలో జరిగిన ఘటనపై పోలీసులు(Police) సీరియస్‌గా ఉన్నారు. స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు రాత్రి సమయంలో కారు తీసుకొని బీచ్‌ హైవేపైకి వచ్చారు. అంతటితో ఆగకుండా కారులో ముగ్గురు కూర్చొని డ్రైవింగ్ చేస్తుండగా...కారు బ్యానెట్‌(Car bonnet)పై మరో ఇద్దరు నిల్చొని డ్యాన్స్‌(Dance)లు చేస్తున్నారు. రోడ్డుప హైటెన్షన్‌ వైర్లు ఉన్న చోటే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అయితే నడిరోడ్డుపై కుర్రాళ్లు మద్యం మత్తులోనే ఓవర్ యాక్షన్ చేసినట్లుగా కనిపించడంతో రోడ్డుపైన పోయే వాళ్లు సెల్‌ఫోన్‌(Cellphone)లో షూట్ చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్ అయింది. వైట్‌ కలర్ ఇన్నోవా కారులో ఉన్న ఇద్దరూ కారుపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం..కొంత దూరం వెళ్లిన తర్వాత దిగి మళ్లీ డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చోవడం అంతా ఓ సినిమాలో విలన్లు, పోకిరోళ్లు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ వార్తలకెక్కారు. వీడియో చూస్తున్న నెటిజన్లు నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్లను వదలవద్దని కోరుతున్నారు.

నడి రోడ్డుపై న్యూసెన్స్..
జాతీయ రహదారిపై తప్పతాగి కారుతో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్న వీడియోలో కారు నెంబర్‌ కూడా క్లియర్‌గా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతున్న వీడియో ఆధారంగా కారు నెంబర్‌ని ట్రేస్ చేశారు పోలీసులు. కారు నెంబర్ యూపీ 14సీఎస్‌33223 గుర్తించారు. నేషనల్ హైవేపై నానా యాగీ చేసిన వాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.
కుర్రాళ్లపై కేసు నమోదు..

డబ్బు, పలుకుబడి ఉందన్న ధైర్యంతోనే ఇలా కుర్రాళ్లు రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగిన మైకంలో వాళ్లు చేసే వెకిలి చేష్టల వల్ల ఎవరికైనా ప్రాణపాయం జరిగితే బాద్యత వహించాల్సిం ఎవరూ అంటూ స్థానికులు, బాధ్యత కలిగిన పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లను పట్టుకొని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ఈ వీడియోని మరికొన్ని గ్రూప్‌లకు షేర్ చేసి వీరి ఆచూకి తెలపండి అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు