VIDEO OF ROBBERS THREATENING TO KILL A GIRL IN UTTAR PRADESH HAS GONE VIRAL SNR
Viral Video: యూపీలో అమ్మాయి పీకపై కత్తి పెట్టాడో దొంగ..తర్వాత మనోడి సీన్ సితారైంది
ప్రతీకాత్మక చిత్రం
viral video:ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు దోపిడీ స్కెచ్ వేసుకునే క్రమంలోనే గ్రామస్తులకు దొరికిపోయారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించడంతో గ్రామస్తులు చితక్కొట్టి పోలీసులకు పట్టించారు. ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముగ్గురు పోకిరోళ్లు దోపిడీ చేయబోయి అడ్డంగా దొరికిపోయారు. అంతా సినిమా స్టైల్లో జరిగిపోతుందనుకున్నారు. వేసుకున్న స్కెచ్ వర్కవుట్ కాకపోవడంతో జనం చేతుల్లో చావు దెబ్బలు తిని జైలుపాలయ్యారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అలీగఢ్ (Aligarh)జిల్లాలోని దాదో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఘటన జరిగింది. ముగ్గురు దొంగలు(Robbers)ఓ ఆటో బుక్ చేసుకొని దారి దోపిడీ చేసేందుకు బయల్దేరారు. కొత్వాలి అత్రౌలీ(Kotwali Atrauli)ప్రాంతంలోని గంగిరి (Gangiri)కూడలి నుండి ఆటో డ్రైవర్‌కు వస్తుండగా దాడోన్ ప్రాంతంలోని సక్రాకు వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకున్నారు. ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఎవర్ని ఎటాక్ చేయాలి..ఎలా చేయాలని మాట్లాడుకోవడం ఆటో డ్రైవర్ గమనించి సగం దూరం వెళ్లిన తర్వత ఆటో ఆపాడు. గ్రామస్తులకు తన ఆటోలో ఉన్న ముగ్గురు దొంగలని చెప్పడంతో గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. ముగ్గుర్ని చుట్టుముట్టడంతో వెంటనే ముగ్గురు దొంగల్లో ఒకడు అటుగా వెళ్తున్న బాలికను పట్టుకున్నాడు. ఆమె మెడపై కత్తి పెట్టి ఎవరైనా తమ దగ్గరకు వస్తే కత్తితో పీక కోసేస్తానంటూ భయపెట్టాడు. దుండగుడి చేతిలో బాలిక(Girl) ఉండటం ఆమె మెడపై కత్తి (Knife)చూపించడంతో గ్రామస్తులు బాలికను వదిలిపెట్టమని కోరారు. అందుకు అతను ఒప్పుకోలేదు. ఇదంతా జరుగుతుండగానే కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. గ్రామస్తులు బాలికను విడిచిపెట్టమని అడుగుతుంటే దొంగ విడిచిపెట్టినా నన్ను కొడతారు , విడిచిపెట్టకపోయినా చంపుతారు అంటూ ఓ కాసేపు అందరికి చమటలు పట్టించాడు.
అంతా సినిమా స్టైల్లో..
దొంగ చేతిలో బాలిక ఉండటం గమనిస్తూనే మెల్లిగా ఒకరిద్దరు దగ్గరకు వెళ్లి అతడిపై అటాక్ చేయడంతో మిగిలిన వాళ్లు సైతం అతడ్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం గ్రామస్తులు ముగ్గురు దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై నిందితుడు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
త్రీ ఇడియట్స్‌కి తిక్క కుదిరింది..
ముగ్గురు దొంగలు బాలికపై దాడి చేయాలనుకోవడంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ముగ్గుర్నిధైర్యంగా పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించడంతో బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. దాడి చేస్తూ దొరికిపోయిన వాళ్లను చూశాం. కాని అలిఘర్‌లో ముగ్గురు దొంగలు మాత్రం దోపిడీ చేయకుండనే ప్లాన్ వేసుకునే క్రమంలోనే దొరికిపోయారు. తప్పించుకునే క్రమంలో అక్కడే మరో బాలికను చంపుతామని బెదిరించారు. ఆ తర్వాత గ్రామస్తుల చేతుల్లో తన్నులు తిన్నారు. చివరకు జైలుపాలయ్యారు త్రీఇడియట్స్.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.